Honeymoon Murder: దేశంలో సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi)ని భార్య సోనమ్ అతి దారుణంగా హత్య చేయించడం ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం సోనమ్ తో పాటు ఆమె ప్రియుడు రాజ్, ముగ్గురు కిరాయి హంతకులు మేఘాలయ పోలీసుల (Meghalaya Police) అదుపులో ఉన్నారు. హత్యకు సంబంధించి వారు లోతుగా దర్యప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో విషయాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక ఆధారాన్ని పోలీసులు గుర్తించారు.
రెండో ఆయుధం గుర్తింపు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. ఈ క్రమంలో భర్తతో కలిసి హనీమూన్ కు వెళ్లిన సోనమ్.. ప్రియుడితో కలిసి కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించింది. రఘవంశీ మృతదేహాన్ని సోహ్రాలోని వీ సావ్ డాంగ్ జలపాతం (Wei Sawdong Falls) వద్ద ఉన్న లోయలో పోలీసులు గుర్తించారు. అయితే తొలుత ఒక ఆయుధంతోనే రాజా రఘవంశీని హత్య చేశారని పోలీసులు భావించారు. ఘటన స్థలి నుంచి పదునైన ఆయుధం, మెుబైల్ ఫోన్ ను గత నెలలో స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా రెండో ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు మేఘాలయ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సీన్ రీక్రియేషన్
హనీమూన్ మర్డర్ కేసును విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT).. తాజాగా సోనమ్ (Sonam), ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా (Raj Kushwaha), మురో ముగ్గురు నిందితులు విశాల్ సింగ్ చౌహన్ (Vishal Singh Chauhan), ఆకాష్ రాజ్ పుత్ (Akash Rajput), ఆనంద్ కుర్మి (Anand Kurmi)లను హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రి-క్రియేషన్ చేసింది. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. నిందితుల్లో ఒకరైన విశాల్.. తొలుత రాజా రఘువంశీపై బలంగా ఆయుధంతో అటాక్ చేశాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. దీంతో ఒక్కసారిగా అతడు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో సోనమ్ భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోగా.. విశాల్ పదే పదే రఘువంశీపై దాడి చేశాడని వివరించారు.
Also Read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళే మంచి ఛాన్స్.. త్వరపడండి!
ట్రెక్కింగ్ వీడియో వైరల్
హత్యకు కొన్ని గంటల ముందు మేఘాలయలోని అటవీ మార్గంలో భార్య సోనమ్ తో కలిసి మృతుడు రాజా రఘువంశీ ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను యూట్యూబర్ దేవేందర్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోను గమనిస్తే చేతిలో కర్ర, పాలిథిన్ కవర్ తో సోనమ్ ముందుకు వెళ్తుండగా.. రాజా రఘువంశీ ఆమె వెంటే నడుస్తూ కనిపించాడు. రాజా రఘువంశీ ప్రాణాలతో కనిపించిన ఆఖరి వీడియో ఇదే కావడం గమనార్హం.
Probably the last video of #RajaRaghuvanshi when a youtuber accidentally recorded him while he was walking with his newly wedded wife Sonam Raghuvanshi towards the Double Decker Living Root Bridge of Nongriat in Meghalaya on 23rd May where he was murdered by Sonam the same day. pic.twitter.com/9wk3UcIf9i
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) June 17, 2025