Donald Trump: భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిని ఖండిస్తూ భారత్ చురకలు సైతం అంటిస్తోంది. అయినప్పటికీ ట్రంప్ తీరులో మార్పు రావడం లేదు. తాజాగా మరోమారు భారత్ – పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించారు. ఆయా దేశాల సైనిక ఘర్షణ తర్వాత తాను మధ్యవర్తిగా వ్యవహరించి శాంతి కుదిరేలా చేశానని పేర్కొన్నారు.
‘హెచ్చరించా.. 5 గంట్లలో ముగిసింది’
వైట్ హౌస్ జరిగిన కేబినేట్ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘నేను ఆ రోజు అద్భుతమైన వ్యక్తి .. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్‌లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
‘7 యుద్ధాలను ఆపాను’
తాజాగా వైట్ హౌస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకూ ఏడు యుద్ధాలను ఆపానని ట్రంప్ ప్రగల్భాలు పలికారు. వాటిలో నాలుగు వాణిజ్య సుంకాలు అడ్డుపెట్టుకొని పరిష్కరించానని అన్నారు. ‘నా వద్ద సుంకాలు, వాణిజ్య శక్తి ఉన్నాయి. నేను మీరు యుద్ధం చేయాలనుకుంటే చేయండి. కానీ అమెరికాతో వాణిజ్యం చేస్తే 100% సుంకం వేస్తాను అని చెప్పాను. దీంతో అందరూ వెనక్కి తగ్గారు’ అని ట్రంప్ అన్నారు. ‘నేను ఆపిన ఏడింటిలో పెద్ద యుద్ధం భారత్ -పాకిస్తాన్‌ది. అది అణ్వాయుధ స్థాయికి చేరుకోబోయింది. వారు అప్పటికే ఏడు జెట్లు కూల్చేసుకున్నారు. అది బాగా ఉద్ధృతమైందని నేను చెప్పాను. డెడ్ లైన్ విధించడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి’ అని ఆయన వివరించారు.
#WATCH | “…I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said what’s going on with you and Pakistan. Then I am talking to Pakistan about trade. I said what’s going on with you and India? The hatred was tremendous. This has been going on for a… pic.twitter.com/gJVOTmKjXN
— ANI (@ANI) August 27, 2025
Also Read: Make in India: ట్రంప్ 50% టారిఫ్స్‌పై మోదీ మాస్టర్ ప్లాన్.. తెరపైకి మేక్ ఇన్ ఇండియా.. ఇక తగ్గేదేలే!
భారత్ స్పందన
అయితే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ ఇలా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే 40 సార్లకు పైగా ట్రంప్ ఇదే మాటను చెప్పారు. భారత్ – పాక్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించి శాంతిని తీసుకొచ్చానని అన్నారు. ఈ విషయాన్ని తొలిసారి మే 10న సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఏ వేదికలో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తూనే వస్తున్నారు. దానిని భారత్ పలుమార్లు ఖండించినప్పటికీ ట్రంప్ వైఖరిలో మార్పు రావడం లేదు. పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో మూడే దేశం జోక్యం చేసుకోలేదని పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ సైతం స్పష్టం చేశారు. ‘సైనిక చర్యను ఆపమని ఏ దేశ నాయకుడు అడగలేదు’ అని చెప్పారు.