Atmanirbhar Bharat (Image Source: twitter)
జాతీయం

Make in India: ట్రంప్ 50% టారిఫ్స్‌‌పై మోదీ మాస్టర్ ప్లాన్.. తెరపైకి మేక్ ఇన్ ఇండియా.. ఇక తగ్గేదేలే!

Make in India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలు.. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. తొలుత 25 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అదనంగా మరో 25 శాతం పన్ను జత చేశాడు. ఫలితంగా అది 50 శాతానికి చేరుకుంది. ఫలితంగా ఇండో-పసిఫిక్‌లో అమెరికాకు అత్యంత బలమైన భాగస్వామిగా ఉన్న భారత్.. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు చెల్లిస్తున్న దేశాల్లో ఒకటిగా మారిపోయింది. భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడంతో ఇది మన దేశ ఎగుమతులు, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ట్రంప్ టారిఫ్ లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. గతంలో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతన్నాయి.

దేశీయ స్వావలంబన దిశగా..
ట్రంప్ అదనపు సుంకాల దెబ్బతో భారత ప్రభుత్వం తక్షణ చర్యల్లోకి దిగింది. ఈ నెల మొదట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పన్నులు తగ్గించి దేశీయ వ్యాపారులు, ప్రజలపై వాటి ప్రభావాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో దేశీయ స్వావలంబనకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. చిన్న వ్యాపారులు, దుకాణదారులు తమ దుకాణాల ముందు ‘స్వదేశీ’ లేదా ‘మేడ్ ఇన్ ఇండియా’ బోర్డులు పెట్టాలని పిలుపునిచ్చారు.

పంద్రాగస్టు రోజున ప్రధాని పిలుపు
పంద్రగాస్టు రోజున ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘మనం స్వయం సమృద్ధిగా మారాలి. అది కూడా బలవంతంగా కాదు.. గర్వంగా చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్ధం పెరుగుతోంది. కాబట్టి మన కష్టాలను చూసి ఏడవడం కాకుండా వాటిని అధిగమించి ఇతరులు మనపై ఆధిపత్యం చెలాయించకుండా నిరోధించాలి’ అని అన్నారు. పంద్రాగస్టు స్పీచ్ తర్వాత ఇదే సందేశాన్ని మరో రెండు ప్రజా సభల్లోనూ ప్రధాని పునరావృతం చేశారు. ట్రంప్ విధించిన 50 శాతం క్రూరమైన సుంకాలకు ప్రతిగా ప్రధాని మోదీ తీసుకున్న వైఖరిని ఇది సూచిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశాన్ని గట్టెక్కించే సందేశం
ఇదిలా ఉంటే ట్రంప్ విధించిన అదనపు సుంకాలు.. భారత్ నుంచి ఆ దేశానికి ఎగుమతయ్యే దుస్తులు, వజ్రాలు, రొయ్యలు వంటి వస్తువులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ఆయా రంగాలపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది మంది భారతీయుల జీవనోపాధికి దెబ్బతీసే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ దీని నుంచే గట్టేక్కే సందేశాన్ని గతంలోనే ఇచ్చారు. ‘ఇండియాలో తయారు చేయండి, ఇండియాలోనే ఖర్చు చేయండి’. అయితే ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ భారత్ లో ఇప్పటివరకూ పెద్దగా సక్సెస్ కాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ తయారీ రంగం భారత జీడీపిలో 15% వద్దే నిలిచిపోయింది.

జీఎస్టీ సంస్కరణల దిశగా అడుగులు
ట్రంప్ ప్రతీకార సుంకాల నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా విధానాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం పన్ను సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లోనే $12 బిలియన్ (సుమారు ₹1 లక్ష కోట్లు) ఆదాయ పన్ను తగ్గింపును ప్రకటించిన తర్వాత.. ఇప్పుడు మోదీ గూడ్స్ & సర్వీసెస్ ట్యాక్స్ (GST) సులభతరం చేస్తామని చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన GST లో పన్ను మినహాయింపులు సరిగా లేకపోవడం, క్లిష్టమైన నియమాలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారాలకు భారంగా మారింది. దీన్ని సులభతరం చేయాలని నిపుణులు ఎన్నోసార్లు సూచించారు. తాజాగా అమెరికా వాణిజ్యంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. జీఎస్టీ సంస్కరణలకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటివరకు ఉన్న 4 శ్లాబుల (5%, 12%, 18%, 28%) జీఎస్టీ విధానాన్ని రెండింటికి శ్లాబులకు పరిమితం చేయాలని (5%, 18%) కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు సమాచారం.

అంతర్జాతీయ సంస్థలు ఏమంటున్నాయంటే?
అమెరికా బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ ప్రకారం.. ఆదాయ పన్ను తగ్గింపుతో పాటు జీఎస్టీ సంస్కరణలు (సుమారు $20 బిలియన్ విలువైన) వినియోగాన్ని గణనీయంగా పెంచనున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రజల వినియోగం (Private consumption) వాటా 60 శాతంగా ఉంది. గ్రామీణ వినియోగం వ్యవసాయ రంగం స్ట్రాంగ్ గా ఉన్నందువల్ల బలంగా ఉంది. అయితే పట్టణాల్లో ఉద్యోగాల కోతలు, తక్కువ జీతాల కారణంగా ప్రజల కొనుగోలు స్థాయి తగ్గిపోయింది. అయితే జీఎస్టీలో పన్ను తగ్గింపు చర్యల ద్వారా ప్రజల వినియోగ పునరుద్ధరణకు దోహదపడతాయని, GDPని పెంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ప్రత్యేకించి స్కూటర్లు, చిన్న కార్లు, దుస్తులు, సిమెంట్ వంటి రంగాలు జీఎస్టీ సంస్కరణ వల్ల లాభపడతాయని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Massive Flash Floods: పోటెత్తిన వరద.. విరుచుకుపడ్డ కొండచరియలు.. ఎటు చూసినా అల్లకల్లోలమే!

వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్!
GST తగ్గింపుతో వచ్చే ఆదాయ లోటును కేంద్ర బ్యాంకు అధిక డివిడెండ్‌లు, అదనపు పన్ను వసూళ్లు భర్తీ చేస్తాయని ఆర్థిక నిపుణలు అంచనా వేస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రభుత్వ ఉద్యోగులు (50 లక్షల మంది), పెన్షనర్లు (68 లక్షల మంది) జీతాల పెంపు పొందనున్నారు. ఇవన్నీ ఆర్థిక వృద్ధిని నిలబెట్టడంలో సహాయపడతాయని భావిస్తున్నారు. మెుత్తంగా జీఎస్టీ సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్ వర్కౌట్ అయితే.. ట్రంప్ సుంకాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా కనిపించకపోవచ్చని అంటున్నారు. అదే జరిగితే భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయాలన్న ట్రంప్ కు షాక్ ఇచ్చినట్లే అవుతోంది.

Also Read: CM Revanth Reddy: చవితి రోజున ఎడతేరిపి లేని వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం