Pakistan Financial Crisis: భారత్ చేస్తున్న ముప్పెట దాడిలో దాయాది దేశం పాకిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓ వైపు భారత్ తో యుద్ధం మరోవైపు స్టాక్ మార్కెట్ల పతనంతో దిక్కుతోచని స్థితిలోకి ఆ దేశం వెళ్లిపోయింది. ఫలితంగా ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం పాక్ ను చుట్టుముట్టింది. దీంతో ప్రపంచ దేశాల ముందు దేహీ అని నిలబడాల్సిన పరిస్థితి పాక్ వచ్చింది. తాజాగా ఆ దేశ ఎకనామిక్ ఎఫైర్స్ డివిజన్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్.. పాక్ ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
అప్పు ఇవ్వండి.. బాబోయ్!
పాక్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వెలువడింది. ఎకనామిక్ ఎఫైర్స్ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్థాన్ పేరుతో ఉన్న ఆ ట్విటర్ హ్యాండిల్.. ప్రస్తుతం పాక్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్లు చెప్పింది. శత్రుదేశం దాడిలో తీవ్రంగా నష్టపోయాయని తమకు అప్పు ఇచ్చి ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములను రిక్వెస్ట్ చేసుకుంది. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని.. దీని నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని ప్రపంచ బ్యాంక్ (World Bank) కు ట్యాగ్ చేస్తూ పాక్ అధికారిక పోస్ట్ పెట్టింది.
గతంలోనే హెచ్చరించినా
వాస్తవానికి కోవిడ్ తర్వాత పాక్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. దేశానికి వచ్చే ఆదాయంలో 50% పైగా అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికే పాక్ వెచ్చిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ మూడీస్ (Moody’s) గతంలోనే పాక్ ను హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తో కయ్యానికి కాలు దువ్వి యుద్ధానికి దిగితే తీవ్ర నష్టం తప్పదని స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరత్వం సాధించడంలో పాక్ మరింత వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొంది. విదేశీ మాదక ద్రవ్యం నిల్వలపైనా పెను ప్రభావం పడుతుందని మూడీస్ వార్నింగ్ ఇచ్చింది.
పాక్ ప్రజల తిరుగుబాటు!
దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ పాక్.. ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోసి కయ్యానికి కాలు దువ్వింది. ప్రస్తుతం భారత్ చేస్తున్న సైనిక, ద్వైపాక్షిక దాడులతో విలవిలలాడిపోతూ ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. మరోవైపు పాక్ ప్రజలు సైతం.. తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఉగ్రవాదులను పెంచి పోషించడం వల్లే ఇవాళ పాక్ ఈ పరిస్థితులు దాపరించాయని మండిపడుతున్నారు. భారత్ దాడితో ఏ క్షణం ఏం జరుగుతుందోనని పాక్ ప్రజలు ఏటీఎంల వద్దకు క్యూ కడుతున్నారు. నిత్యవసరాలకు అవసరమైన సొమ్మును డ్రా చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో అక్కడి ఏటీఎంలు సైతం ఖాళీ అయిపోతున్నాయి.
Also Read: IPL 2025 Postponed: పాక్‌తో యుద్ధం ఎఫెక్ట్.. ఐపీఎల్ నిరవధిక వాయిదా.. బీసీసీఐ వెల్లడి
పరారీలో పాక్ ప్రధాని!
ఇదిలా ఉంటే గురువారం రాత్రి పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇస్లామాబాద్, సియాల్ కోట్, కరాచీపై భారత్ డ్రోన్ దాడులు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్ ముప్పేట దాడితో భయపడిపోయిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan Prime Minister Shehbaz Sharif) అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇస్లామాబాద్‌లోని తన ఇంటిని ఖాళీ చేసి బంకర్‌లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.