Civil War in Pakistan: దశాబ్దాల కాలంగా దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాక్ కు భారత బలగాలు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నాయి. పహల్గాం దాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన సైన్యం.. ప్రస్తుతం దానిని కొనసాగిస్తోంది. గురువారం రాత్రి భారత్ పైకి దూసుకొచ్చిన రెండు పాక్ యుద్ధ విమానాలను ధ్వంసం చేశాయి. అటు ఇండియన్ నావీ (Indian Navy).. కరాచీ పోర్ట్ (Karachi Port) పై దాడి చేసి నాశనం చేసింది. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని కార్యాలయం (Pak Prime Minister Office) సమీపంలో భారీ పేలుడు సైతం జరిగింది. ఇలా వరుస పరిణామాలతో అల్లాడుతున్న పాకిస్థాన్ కు.. దేశ ప్రజల నుంచి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఎటూ దిక్కుతోచని స్థితిలోకి దాయాదీ దేశం వెళ్లిపోయింది.
రోడ్లపైకి ఇమ్రాన్ సపోర్టర్స్!
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan).. ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నేతృత్వంలోని ప్రభుత్వం.. ఆయన్ను జైలులో పెట్టింది. అయితే ప్రస్తుతం భారత్ ముప్పెట దాడిలో అల్లాడుతున్న పాక్ కు.. ఇమ్రాన్ ఖాన్ అనుచరులు చుక్కలు చూపిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ కష్టకాలంలో పాక్ ను గట్టెక్కించగల సామర్థ్యం ఒక్క ఇమ్రాన్ కే ఉందని నినాదాలు చేస్తున్నారు. ఇమ్రాన్ ను రిలీజ్ చేసి పాక్ ను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్ రోడ్లపై ఇమ్రాన్ ఖాన్ అనుచరులు చేస్తున్న వీరంగం వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
🚨Just In:
Some latest visual from Lahore
According to sources angry Imran khan PTI on the streets of Lahore protesting against the Pak army to release Imran khan.
What is going on Pakistan ? pic.twitter.com/8KqNdjSViK
— OsintTV 📺 (@OsintTV) May 8, 2025
బలూచ్ రెబల్స్ ముప్పెట దాడి
మరోవైపు భారత దాడులతో బలహీన పడ్డ పాక్ కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా పాకిస్థాన్ ఆర్మీపై బాంబులు వర్షం కురిపిస్తూ హతం చేస్తున్న బీఎల్ఏ.. తాజాగా ఆ దేశంలోని ఆరు స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించింది. ముఖ్యంగా క్వెట్టా నగరంలోని పాక్ సైన్యానికి చెందిన ఫ్రంట్ టైర్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడికి తెగబడినట్లు పేర్కొంది. నగరం నుంచి పాక్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టినట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం క్వెట్టా నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. అంతేకాదు బలూచిస్థాన్ లో మూడింట రెండొంతులు తమ ఆధీనంలోకి వచ్చేసినట్లు BLA వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఒకవైపు భారత్ ఆర్మీ, మరోవైపు ఇమ్రాన్ అనుచరులు, బీఎల్ఏ దాడులతో పాకిస్థాన్ ఆర్మీ వణికిపోతోంది.
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
ఆర్థిక సంక్షోభంలో పాక్
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్.. భారత్ దాడులతో మరింత నష్టాల్లో కూరుకుపోయింది. భారత్ ప్రతిఘటనతో రుణాల కోసం అవస్థలు పడుతోంది. ఈ నేపథ్యంలో తన అంతర్జాతీయ భాగస్వాముల్ని మరిన్ని రుణాలు ఇవ్వాలని ఎక్స్ వేదికగా పాక్ కోరింది. అలాగే ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైన పరిస్థితులను శాంతింపచేయడానికి సహాయపడాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ పోస్ట్ అంతర్జాతీయంగా వైరల్ కావడంతో పాక్ బుకాయింపులు మెుదలుపెట్టింది. తమ అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ కట్టు కథలు చెప్పే ప్రయత్నం చేసింది. కాగా పాక్ కు రుణాలు ఇవ్వొద్దని ఐఎంఎఫ్ కు భారత్ ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే.