Pakistan ( Image Source: Twitter)
అంతర్జాతీయం

Islamabad Blast: ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు.. 12 మంది మృతి, 20 మందికి గాయాలు

Islamabad Blast: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని G-11 ప్రాంతంలో ఉన్న కోర్టు సమీపంలో పార్క్ చేసిన కారు ఒక్కసారిగా పేలిపోవడంతో 12 మంది మరణించగా, 20 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పేలుడు కారణంగా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలవరానికి గురైంది. భద్రతా బలగాలు వెంటనే ప్రాంతాన్ని ముట్టడి చేసి, రక్షణ చర్యలు చేపట్టాయి.

తెలిసిన సమాచారం ప్రకారం, వాహనంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని స్థానిక మీడియా పేర్కొన్నప్పటికీ, అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ కోర్టు ప్రాంతం ప్రతిరోజూ విచారణల కోసం వచ్చే ప్రజలతో రద్దీగా ఉండటం వల్ల పేలుడు తీవ్రత ఎక్కువగా అనిపించింది.

Also Read: TTD Adulterated Ghee: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు.. మాజీ ఈవో ధర్మారెడ్డిపై ప్రశ్నల వర్షం!

ఈ ఘటన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో పార్క్ చేసిన కారులో జరిగిన పేలుడు తర్వాతి రోజే చోటుచేసుకోవడం గమనార్హం. ఆ ఘటనలో 13 మంది మరణించగా, భారత్‌లో అధికారులు UAPA, Explosives Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Dharmendra Health Update: బతికి ఉండగానే చంపేస్తారా? మీడియాపై ధర్మేంద్ర కుమార్తె ఇషా, భార్య హేమామాలిని ఫైర్

మరో వైపు, వానా నగరంలో పాకిస్థాన్ సైనిక కళాశాలపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు చేసిన యత్నం విఫలమవడంతో ఈ పేలుడు ఆ దాడికి ప్రతీకార చర్యగా జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఆత్మాహుతి దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుని, ఇద్దరిని హతమార్చగా, మిగిలిన ముగ్గురిని నిర్బంధించింది. వానా ప్రాంతం చాలా కాలంగా పాకిస్థాన్ తాలిబాన్, అల్‌ఖైదా, ఇతర తీవ్రవాద సంస్థలకు గూఢస్థలంగా ఉంది. తాజా ఇస్లామాబాద్ పేలుడు ఈ దేశ భద్రతా పరిస్థితిపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.

Also Read: Bandi Sanjay: ఆ జిల్లాల్లోని టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష ఫీజు చెల్లించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Just In

01

GHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం

Delhi Blast Case: దిల్లీలో భారీ పేలుడు.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం.. రంగంలోకి ఎన్ఐఏ

Collector Hanumanth Rao: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా? లేదా? : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

12A Railway Colony: అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’ ట్రైలర్ వచ్చేసింది..

Delhi Blast: కీలక అనుమానితుడు డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా?