Donald trump
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Iran Trump: ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడి తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన

Iran Trump: ఇరాన్‌లో మూడు కీలకమైన అణు కేంద్రాలు ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై అమెరికన్ బలగాలు బాంబులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శాంతి లేదా విషాదం.. ఈ రెండింట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు ‘అద్భుతమైన సైనిక విజయం’గా ఆయన అభివర్ణించారు. ఈ మిషన్ ద్వారా ప్రాథమిక లక్ష్యాన్ని సాధించామని ట్రంప్ చెప్పారు. ఇరాన్ న్యూక్లియర్ ఎన్‌రిచ్‌మెంట్ (యూరేనియం గాఢత పెంచే ప్రక్రియ) సామర్థ్యాలను ధ్వంసం చేయడమే ప్రాథమిక లక్ష్యమని, దానిని సాధించామని వివరించారు.

‘‘మధ్యప్రాచ్య ప్రాంతంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఇరాన్ ఇప్పుడు శాంతిని నెలకొల్పాలి. లేదంటే, భవిష్యత్‌లో దాడులు చాలా తీవ్రమవుతాయి. చాలా సులభంగా దాడులు చేస్తామని గుర్తుంచుకోండి. ఇంకా చాలా లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. ఈ రాత్రి జరిపిన దాడి ఇప్పటివరకు చేసిన దాడుల్లోకెళ్లా అన్నింటికంటే సంక్లిష్టమైనది. బహుశా అత్యంత ప్రాణాంతకమైనది కూడా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు.

కాగా, ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న ఘర్షణలో అమెరికా తొలిసారి సైనిక జోక్యం చేసుకుంది. ఇరాన్ అణుకేంద్రాలు, వైమానిక, రక్షణ వ్యవస్థలు, క్షిపణి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ గత వారం రోజులుగా భీకర దాడులు చేస్తున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Read this- US bombs Iran: ఇరాన్‌లో అమెరికా దాడులు.. ఎప్పుడూ ఉపయోగించిన బాంబుల వర్షం

వేగంగా వెంటాడుతాం: ట్రంప్

‘‘ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పోషించే అగ్రదేశమైన ఇరాన్ అణుశక్తిని పెంచే సామర్థ్యాన్ని ధ్వంసం చేయడమే, అణు కార్యకలాపాలను ఆపడమే మా లక్ష్యం. ఈ రాత్రి జరిపిన దాడులు అద్భుతమైన సైనిక విజయమని నేను ప్రపంచానికి తెలియజేస్తున్నాను. ఇరాన్‌ అణుశక్తిని పెంపొందించే అణు కేంద్రాలు పూర్తిగా, సంపూర్ణంగా నేలమట్టమయ్యాయి’’ అని ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఆయన ప్రసంగించారు. మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రసంగించిన ఆయన, ‘‘ఇరాన్ వీలైనంత త్వరగా శాంతి నెలకొనకపోతే, మేము మా ఇతర లక్ష్యాలను ఖచ్చితత్వంతో, వేగంగా, నైపుణ్యంతో వెంటాడుతాం’’ అని ఇరాన్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.

ఇరాన్‌లో దాడుల విషయంలో అమెరికా సమన్వయంతో పనిచేసిన ఇజ్రాయెల్, ఆ దేశ నాయకత్వాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో ఏ ఇతర బృందమూ కలిసి పనిచేయనంత చక్కగా కలిసి కృషి చేశాం. ఇజ్రాయెల్‌కు భయంకరమైన ముప్పు పొంచివుండడంతో మేము చాలా దూరం వెళ్లాం. అద్భుతంగా పనిచేసిన ఇజ్రాయెల్ సైన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని ట్రంప్ అన్నారు.

పర్యావసనాలు ఎప్పటికీ ఉంటాయ్: ఇరాన్ ప్రకటన

Read this- Gold Rate ( 22-06-2025): తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం కీలక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి చట్టాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (NPT) అమెరికా తీవ్రంగా ఉల్లంఘిందని ఆయన మండిపడ్డారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశంగా ఉన్న అమెరికా, తాము శాంతియుత విధానంలో అణు కేంద్రాలు నెలకొల్పి వాటిని లక్ష్యంగా చేసుకుని ‘నేరపూరిత ప్రవర్తన’తో దాడి చేసిందని అరాఘ్చి ఆరోపించారు. అమెరికా జరిపిన దాడులు దారుణమైనవని, ఈ తీవ్ర పరిణామాలు ఎప్పటికీ కొనసాగుతాయని హెచ్చరించారు. ఐరాస సభ్య దేశంగా ఉన్న అమెరికా చేసిన ఈ దాడులు అత్యంత ప్రమాదకరం, చట్టవిరుద్ధమైనవని, అమెరికా నేరపూరిత ప్రవర్తనపై ప్రతి సభ్య దేశం ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా తప్పుడు ప్రవర్తనను ప్రపంచమంతా గుర్తించాలని అన్నారు.

ఐరాస చట్టాలలోని నిబంధనల ప్రకారం, ఆత్మరక్షణ హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఆప్షన్లు ఇరాన్‌కు ఉన్నాయని సయ్యద్ అన్నారు. తన సార్వభౌమత్వాన్ని, దేశ ప్రయోజనాలు, ప్రజలను రక్షించుకోవడానికి ఇరాన్‌కు అన్ని ఆప్షన్లు ఉన్నాయని పేర్కొంది. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణుకేంద్రాలపై అమెరికా చేసిన దాడిపై ఇరాన్ ఈ విధంగా స్పందించింది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?