Emmy Awards 2025: 53వ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ విజేతల జాబితా అధికారికంగా ప్రకటించారు. ఈసారి బ్రిటన్ అత్యధికంగా ఏడు విభాగాల్లో అవార్డులు దక్కించుకుని కొత్త రికార్డ్ సృష్టించింది. బెస్ట్ డ్రామా విభాగంలో ITV స్టూడియోస్ నిర్మించిన, 1980ల నేపథ్యంతో రూపొందిన కామెడీ-డ్రామా ‘Rivals’ అవార్డు గెలుచుకుంది. జిలీ కూపర్ రాసిన నవలల ఆధారంగా రూపొందిన ఈ సీరీస్‌లో డేవిడ్ టెన్నెంట్, ఐడెన్ టర్నర్, కేథరిన్ పార్కిన్సన్ నటించారు.
బెస్ట్ కామెడీ అవార్డును డేవిడ్ మిచెల్ నటించిన ‘Ludwig’ కైవసం చేసుకుంది. ఈ కథలో మిచెల్ ఒక పజిల్ మాస్టర్‌గా నటించాడు. కనుమరుగైన పోలీస్ డిటెక్టివ్ అన్నయ్య వేషం వేసుకుని, అతడి గల్లంతు వెనకున్న నిజాన్ని తెలుసుకోవడానికి చేసే ప్రయాణమే ఈ కథ. అన్నా మ్యాక్స్‌వెల్ మార్టిన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా యుకే బెస్ట్ కిడ్స్ లైవ్-యాక్షన్ (Fallen), బెస్ట్ టీవీ మూవీ/మినీ సిరీస్ (Lost Boys and Fairies), బెస్ట్ డాక్యుమెంటరీ (Hell Jumper), కరెంట్ అఫైర్స్ (Dispatch: Kill Zone: Inside Gaza) విభాగాల్లో కూడా విజయం సాధించింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ‘Until I Kill You’ లో నటించిన అన్నా మ్యాక్స్‌వెల్ మార్టిన్ గెలుచుకున్నారు.
ఇతర విభాగాల్లో విజేతలు
బెస్ట్ యాక్టర్: ఓరియోల్ ప్లా – Yo, adicto (I, Addict)
టెలెనోవెలా: Deha (The Good & The Bad)
కిడ్స్ – యానిమేషన్: Bluey
నాన్-స్క్రిప్టెడ్ ఎంటర్టైన్‌మెంట్: Shaolin Heroes
న్యూస్: Gaza, Search for Life
స్పోర్ట్స్ డాక్యుమెంటరీ: It’s All Over: The Kiss That Changed the Spanish Football
షార్ట్-ఫార్మ్ సిరీస్: La mediatrice (The Mediator)
ఆర్ట్స్ ప్రోగ్రామింగ్: Ryuichi Sakamoto: Last Days
Also Read: Alleti Maheshwar Reddy: రూ.6.29 లక్షల కోట్ల కుంభకోణం.. ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు
ప్రత్యేక గౌరవ పురస్కారాలు
న్యూయార్క్ హిల్టన్ మిడ్‌టౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక పురస్కారాలు కూడా అందజేశారు.
ఇంటర్నేషనల్ ఎమ్మీ ఫౌండర్స్ అవార్డు: డిస్ని ఎంటర్టైన్‌మెంట్ కో-చైర్మన్ డానా వాల్డెన్
ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు: బ్రెజిల్ గ్రూపో గ్లోబో అధ్యక్షుడు జావో రాబర్టో మారిన్యో

