Nano Banana Pro: గూగుల్ జెమిని నానో బనానా ప్రో మోడల్ గత వారం నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 4K ఇమేజ్ జనరేషన్, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, ఫోటో ఎడిటింగ్, పైగా Google Search ఇంటిగ్రేషన్. ఇవన్నీ వచ్చిన తర్వాత యూజర్లు దీనిని ఎన్నో క్రియేటివ్ పనులకు వాడుతున్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను ఇన్ఫోగ్రాఫిక్‌గా మార్చడం నుంచి కాంప్లెక్స్ టెక్స్ట్‌ను వైట్‌బోర్డ్ స్టైల్‌లో చూపించడం వరకు చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నారు. కానీ ఇదే సమయంలో, కొంతమంది యూజర్లు Nano Banana Proతో నిజానికి దగ్గరగా ఉండే నకిలీ ఆధార్, PAN కార్డులు కూడా తయారవుతున్నాయని గమనించారు. రియల్ లైఫ్‌లో ఇది పెద్ద ప్రైవసీ సమస్య అయ్యే అవకాశం ఉంది.
Also Read: Ethiopia Volcano: 12,000 ఏళ్ళ తర్వాత ఇథియోపియా అగ్ని పర్వతం పేలడంతో ఢిల్లీలో విషపూరిత వాతావరణం
కొందరు టెస్ట్ ఇస్తే వాళ్ళు ఇలా చెప్పారు. మేము కూడా టెస్ట్ చేస్తే.. ఆశ్చర్యంగా.. ఎలాంటి హెచ్చరికలు లేకుండా నకిలీ Aadhaar, PAN కార్డ్‌లను ఇది వెంటనే క్రియేట్ చేసింది. నేను ఇచ్చిన ఫోటో, డిటైల్స్, స్టైల్ అన్నీ యథాతథంగా వేసి ఇమేజ్ ఇచ్చేసింది. సేఫ్టీ కారణాల వల్ల ఆ ప్రాంప్ట్‌ను ఇక్కడ షేర్ చేయడం లేదని తెలిపారు.
Also Read: Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 50 లక్షల వైద్య పరికరాలు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్
Google వేసే Gemini watermark ఆ ఇ మేజ్‌లలో కనిపిస్తుంది, కానీ దాన్ని కూడా కట్ చేయడం, క్రాప్ చేయడం అంత కష్టం కాదు. అలాగే ఇవన్నీ SynthID అనే ఇన్విజిబుల్ వాటర్‌మార్క్ తో కూడా ట్యాగ్ అవుతాయి. నిజమైనవి కాదని గుర్తు పట్టడానికి. అయితే, ఇంత రియలిస్టిక్‌గా కనిపించే ఐడీలు త్వరగా చూపినప్పుడు నిజమైన వాటిగా కనిపించే ఛాన్స్ చాలా ఉంది. Google సేఫ్టీ టీమ్‌లు ఈ అంశాన్ని ఎలా మిస్ చేశారో అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
ఇది మొదటిసారి కాదు. ChatGPT GPT-4o టైంలో కూడా చాలామంది PAN, Aadhaar లాంటి IDs సులభంగా క్రియేట్ చేయించుకున్నారు. కానీ ఇప్పుడిది Nano Banana Proతో మరింత ప్రమాదకరం అయింది. ఎందుకంటే ఇది ఇమేజ్ క్రియేషన్‌లో ChatGPT కంటే రెండు రెట్లు శక్తివంతమని చెప్పాలి.

