Ethiopia Volcano: అగ్ని పర్వతం పేలడంతో ఢిల్లీలో విషపూరిత గాలి
Ethiopia Volcano ( Image Source: Twitter)
జాతీయం

Ethiopia Volcano: 12,000 ఏళ్ళ తర్వాత ఇథియోపియా అగ్ని పర్వతం పేలడంతో ఢిల్లీలో విషపూరిత వాతావరణం

Ethiopia Volcano: ఉత్తర ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్ని పర్వతం ఆదివారం ఉదయం 12,000 సంవత్సరాల తర్వాత మొదటిసారి పేలింది. 100-120 km/h వేగంతో గాలులు ధూళి మేఘాలను భారత్ తో సహా అనేక దేశాల వైపు తీసుకువెళ్ళాయి. ఈ ధూళి మేఘాలు రాత్రి సమయంలో ఢిల్లీకి చేరి, ఇప్పటికే విషపూరిత గాలులతో బాధపడుతున్న నగరంలో పరిస్థితిని మరింత కష్టతరం చేశాయి. అలాగే, విమానయాన కార్యకలాపాలపై ప్రభావం చూపాయి.

ధూళి మేఘాల పరిధి

IMD ప్రకారం, ధూళి మేఘాలు ముందుగా గుజరాత్ ప్రాంతాన్ని కవర్ చేసి, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపుకు వెళ్ళాయి. అంతేకాక, ధూళి మేఘాలు చైనాకు వైపు తరలవుతాయని, భారత ఆకాశంలో 7:30 pm నాటికి ఉపసంహారం అవుతుందని తెలిపింది. IMD ప్రకారం, “ఎత్తైన గాలులు ఎథియోపియా నుండి ఎరుపు సముద్రం, యెమన్, ఓమన్, ఆరబియన్ సముద్రం దాటుకొని పశ్చిమ, ఉత్తర భారత్ వైపు ధూళిని తీసుకెళ్తున్నాయి” అని పేర్కొంది.

Also Read: Kabaddi World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు.. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ టైటిల్!

విమానయానంపై ప్రభావం

భారత విమానయాన సంస్థ DGCA సూచన మేరకు, అన్ని ఎయిర్‌లైన్లు ధూళి ప్రభావిత ప్రాంతాలను తప్పించుకోవాలని, ఫ్లైట్ ప్లానింగ్, రూటింగ్, ఇంధన వినియోగం తగిన విధంగా మార్చాలని సూచించింది. ఏదైనా అనుమానాస్పద ధూళి సంబంధిత ఘటనలు, ఇంజిన్ పనితీరు లోపాలు, కెబిన్ పొగ/గాలి వాసనల గురించి తక్షణమే రిపోర్ట్ చేయమని DGCA కోరింది.

Also Read: Kaloji Narayana Rao University: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో కలకలం.. పీజీ మార్కుల గోల్‌మాల్‌పై విజిలెన్స్ తనిఖీలు!

Air India, IndiGo, SpiceJet సంస్థలపై ప్రభావం

ఎయిర్ ఇండియా 11 విమానాలను రద్దు చేసింది. ఇందులో నెవార్క్-ఢిల్లీ, న్యూయార్క్-ఢిల్లీ, దుబాయ్-హైదరాబాద్, దోహా-ముంబై, దుబాయ్-చెన్నై, దమ్మమ్-ముంబై, దోహా-ఢిల్లీ, చెన్నై-ముంబై, హైదరాబాద్-ఢిల్లీ ఫ్లైట్లు ఉన్నాయి. ఇండిగో అన్ని సురక్షిత చర్యలతో ఫ్లైట్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ప్రకటించింది.

వాతావరణ, రసాయన ప్రభావం

నిపుణుల ప్రకారం, ధూళి మేఘాలలో ప్రధానంగా సల్ఫర్ డయాక్సైడ్ (SO2), తక్కువ నుంచి మోడరేట్ పరిమాణంలో అగ్ని పర్వత ధూళి ఉంది. దీని ప్రభావం AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలపై ప్రత్యక్షంగా, నేపాల్, హిమాలయాలు, ఉత్తరప్రదేశ్ తీర ప్రాంతం, తర్వాత చైనాకు చేరే ప్రాంతాల్లో SO2 స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.

Also Read: Alleti Maheshwar Reddy: రూ.6.29 లక్షల కోట్ల కుంభకోణం.. ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన ఆరోపణలు

హైలీ గుబ్బి అగ్ని పర్వతం వివరాలు

ఈ అగ్ని పర్వతం ఎత్తు సుమారు 500 మీటర్లు ఉంది. ఇది రిఫ్ట్ వ్యాలీలో, రెండు రెండు టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉంటుంది. పేలుడు సమయంలో ధూళి,  పొగ 14 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. అనేక గ్రామాలు ధూళి కవచంతో కప్పబడినట్లు అక్కడ ఉండే స్థానికులు తెలిపారు. “భూకంపాలు తరచూ సంభవించే Afar ప్రాంతంలో, ఆకస్మికంగా వచ్చిన ఈ పేలుడు శబ్దం స్థానికులకు పెద్ద బాంబ్ పేలినట్లుగా అనిపించినట్టు చెబుతున్నారు.”

Just In

01

Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!

Minister Sridhar Babu: తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మహిళల కీలక పాత్ర : మంత్రి శ్రీధర్

Rumour Controversy: వారి బ్రేకప్‌ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్