Alleti Maheshwar Reddy:హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫార్మేషన్(హెచ్ఐఎల్ టీ)’ పాలసీ ద్వారా తెలంగాణలో అతిపెద్ద కుంభకోణం జరగబోతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 9Alleti Maheshwar Reddy) సంచలన ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడలకు చెందిన 9,292 ఎకరాల భూములను ఇకపై మల్టీ యూజ్ జోన్లుగా కన్వర్షన్ చేస్తూ ఇటీవలే విడుదల చేసిన జీవోపై ఆయన ఆరోపణలు గుప్పించారు. రూ.6.29 లక్షల కోట్ల విలువైన ఈ భూమిని కేవలం రూ.5 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మేందుకు సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు.
Also Read: Alleti Maheshwar Reddy: కవిత ఎదగడం కేటీఆర్‌కు ఇష్టం లేదా?
ఈ కుంభకోణాన్ని తాము అడ్డుకుంటాం
అప్పనంగా హెచ్ఐఎల్‌టీ భూములు అప్పజెప్పేందుకు సిద్ధమవుతోందన్నారు. ఎజెండాలో పెట్టకుండా జస్ట్ డ్రాఫ్ట్ కాపీ పెట్టి రిటర్న్ పెట్టారన్నారు. ఈ భూమితో రాష్ట్ర అప్పులన్నీ తీరుతాయని ఏలేటి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ కుంభకోణాన్ని తాము అడ్డుకుంటామన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భూమిని ధారాదత్తం చేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంక్వైరీ చేసి జైలుకు పంపిస్తామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులనే కాంగ్రెస్ చేస్తోందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్.. గొర్రెలు తింటే తాము బర్రెలు తింటామనేలా మంత్రి శ్రీధర్ బాబు మాటలు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి శ్రీధర్ బాబుకు సిగ్గుందా?
రూ.5 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని చెప్పడానికి మంత్రి శ్రీధర్ బాబుకు సిగ్గుందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వాటా లేకుంటే దీనిని కేబినెట్‌లో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. మంత్రులు తలా రూ.10 వేల కోట్లు వస్తాయనే కేబినెట్‌లో ఎవరూ నోరు మెదపలేదని ఆరోపించారు. ఈ భూముల వ్యవహారంపై లోతైన ఎంక్వైరీ జరపాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో కవిత రూ.2 వేల కోట్ల ల్యాండ్ స్కాం చేసిందంటూ ఇటీవల ఒక పేపర్ లో ప్రచురితమైందని, అయినా దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
Also Read: Ram Chandra Rao: పలు జిల్లాల్లో వీక్‌గా పార్టీ.. చెక్ పెడతారా?
