Ram Chandra Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు(Ram chendar Rao) ఇటీవల ఎన్నికయ్యారు. కాగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చార్జ్ తీసుకోనున్నారు. కొత్త బాధ్యతలు చేపట్టబోయే రాంచందర్ రావుకు సవాళ్లు స్వాగతమివ్వనున్నాయి. పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు, పార్టీలో నేతల మధ్య కొరవడిన సమన్వయం, ఆధిపత్య పోరుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పార్టీ వీక్ గా ఉండటం ప్రధాన సమస్యలుగా మారాయి. వీటికి తోడు భవిష్యత్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానికసంస్థల ఎన్నికలు(Local Body Election) సైతం రానున్నాయి. ఈ సమస్యలకు ఆయన ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాషాయ పార్టీ సత్తా చాటింది. ఆ ఎన్నికలకు ఇన్ చార్జీగా రాంచందర్ రావు వ్యవహరించారు. గెలుపునకు రూట్ మ్యాప్ వేయడంలో కీలకంగా వ్యవహరించారు. అలాగే తెలంగాణలో బీజేపీకి 40 లక్షలకు సభ్యత్వాతలను చేపట్టింది. ఈ సభ్యత్వాలకు సైతం ఇన్ చార్జీగా ఆయన వ్యవహరించి సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఎంపీల్లో పలువురు అధ్యక్ష పీఠంపై ఆశలు
తెలంగాణ(Telangana)లో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీ(MP)లు, ఎనిమిది మంది ఎమ్మెల్యే(MLA)లు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలతో బీజేపీ బలం 21 మంది ప్రజాప్రతినిధులకు చేరింది. వీరిలో తాజాగా రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులను, 8 మంది సీనియర్ ఎంపీలను రాంచందర్ రావు ఎలా సమన్వయం చేసుకుంటారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎంపీల్లో పలువురు అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకుని నిరాశకు గురయ్యారు. ఈనేపథ్యంలో వారి నుంచి రాంచందర్ రావుకు ఎలాంటి సహకారం అందుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు ప్రకటన కార్యక్రమానికి ఎంపీ అర్వింద్(MP Arvindh) దూరంగా ఉన్నారు.
Also Read: Gold Rates (03-07-2025): ఆషాఢంలో మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స
వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నానని ముందుగా సమాచారం ఇచ్చినప్పటికీ అసంతృప్తి కారణంగానే రాలేదని పార్టీలో చర్చ సాగుతోంది. ఇంకోవైపు ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కార్యక్రమానికి వచ్చినప్పటికీ నిరుత్సాహంగా కనిపించారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) కార్యక్రమం మధ్యలోనే హడావుడిగా వెళ్లిపోయారు. ఇక తాజా, మాజీ ముఖ్యమంత్రులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి(MLA Venkata Ramana Reddy) పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు పాల్వయి హరీశ్(Pallavi Harish), వెంకటరమణ రెడ్డి అధ్యక్ష ఎన్నిక ప్రకటన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరందరిని సమన్వయం చేసుకోవడం రాంచందర్ రావు ముందున్న సవాల్. కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఎలా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
కాపాడుకోవడం పార్టీకి పెద్ద సవాల్
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. ఉమ్మడి నల్లగొండ(Nalgoanda), వరంగల్(Warangaal), ఖమ్మం(Khammam) జిల్లాలో పార్టీ చాలా వీక్ గా ఉంది. ఆ జిల్లాల్లో బలోపేతం ఎలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకే పరిమితమైన కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికి పైగా ఓట్లు సాధించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ ఓటు శాతాన్ని కాపాడుకోవడం పార్టీకి పెద్ద సవాల్ గా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీటన్నింటికంటే లోకల్ బాడీ ఎన్నికలకు సింగిల్ గానే పోటీ చేస్తామని చెబుతన్న పార్టీకి పలు జిల్లాల్లో లీడర్లు కరువయ్యారు. అభ్యర్థులను తయారు చేసుకోవడం కూడా బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్ గా మారనుంది. ఇది రాంచందర్ రావుకు పెద్ద పరీక్షగా మారనుంది.
నేడు స్టేట్ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన రాంచందర్ రావు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఉదయం 9 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద రాంచందర్ రావు ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. అనంతరం 10 గంటలకు అమరవీరు స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. 11 గంటలకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. ఆపై పూజ కార్యక్రమాల అనంతరం చార్జ్ తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొననున్నారు.
Also Read: Viral Video: ఇదేం దారుణం రా బాబూ.. అన్యాయంగా ఒక మనిషిని..