Viral Video: ఇల్లు గడుపుకునేందుకు ఒక కాఫీ కేఫ్‌లో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న ఓ వ్యక్తి పట్ల కొందరు దుండగులు అమానుషంగా వ్యవహరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కౌంటర్‌లో కూర్చొని క్రమశిక్షణతో, యజమానుల రూల్స్ పాటించే అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మానవ మృగాలుగా మారి విచక్షిణారహితంగా దాడి చేశారు. అమానవీయమైన ఈ ఘటన (Viral Video) బెంగళూరు నగరంలో బుధవారం సాయంత్రం జరిగింది.
నగరంలోని శేషాద్రిపురంలో బాగా పాపులర్ అయిన ‘నమ్మ ఫిల్టర్ కాఫీ’ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న సిబ్బందిలోని ఒక వ్యక్తిపై కొందరు వ్యక్తులు విచక్షిణారహితంగా దాడి చేశారు. ఉచితంగా ఎక్స్‌ట్రా కప్పు కాఫీ కావాలంటూ నిందిత వ్యక్తులు కోరగా, కౌంటర్‌లో కూర్చొన్న బాధితుడు ససేమిరా అనడమే ఇందుకు కారణమైంది. కొత్త ఆర్డర్ ఇవ్వకుండా అదనపు కప్పు కాఫీ ఇవ్వడం కుదరదని, ఇక్కడి రూల్స్ అందుకు విరుద్ధమని చెప్పినా నిందితులు మాట వినలేదు. ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. బుధవారం సాయంత్రం 6.50 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కేఫ్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
Read also- Real Father: సినిమాలు కూడా సరిపోవు.. థ్రిల్లర్‌ను తలపించేలా కూతుర్ని కాపాడిన తండ్రి
ఉచితంగా ఎక్స్‌ట్రా కప్పు కాఫీ అందించడానికి వీలుపడదని ఇతర సిబ్బంది కల్పించుకొని చెప్పినా వారు వినలేదు. నిందితులు అత్యంత దురుషుగా వ్యవహరించారు. ఈ క్రమంలో కౌంటర్‌లో కూర్చున్న బాధిత వ్యక్తితో వాగ్వాదానికి కూడా దిగారు. ఉద్యోగిని దుర్భాషలాడుతూ మాట్లాడారు. ముఖంపై బలంగా కొట్టారు. పొత్తికడుపులో గట్టిగా తన్నారు. తలపై కూడా కొట్టారు. తనను తాను రక్షించుకునేందుకు బాధితుడు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దీంతో, మిగతా సిబ్బంది వచ్చి నిందితులను నిలువరించారు. ఈ ఘటనపై శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో కేఫ్ యాజమాన్యం కేసు పెట్టింది. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఫ్రీగా మరో కప్పు కాఫీ ఇవ్వలేదన్న కారణంతో కౌంటర్‌లో కూర్చున్న సాధారణ వ్యక్తిపై ప్రతాపం చూపించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి ఒక సాధారణ ఉద్యోగిపై చేయి చేసుకోవడం అమానవీయమని మండిపడుతున్నారు.
Read also- HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?
Shocking: A staffer at Namma Filter Coffee, Bengaluru, was assaulted after denying an extra cup per café policy.
CCTV shows him being punched & kicked by a group of men.
The incident occurred at 6:50 PM in Seshadripuram. Police complaint filed. #JusticeForStaff pic.twitter.com/F8EwYMmtkJ— Jeetwin News (@JeetwinNews) July 3, 2025