Father Saves daughter
Viral, లేటెస్ట్ న్యూస్

Real Father: సినిమాలు కూడా సరిపోవు.. థ్రిల్లర్‌ను తలపించేలా కూతుర్ని కాపాడిన తండ్రి

Real Father: కొన్నిసార్లు బంధాలు, బాధ్యతలను పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితి ఎదురైన వేళ ఓ తండ్రి చూపించిన తెగువ, కూతురిపై అతడు చాటుకున్న ప్రేమకు ఎవరైనా సలాం అనాల్సిందే. ఎదురుగా ఉన్నవి పాములైనా కూతురి ప్రాణం కన్నా తన ప్రాణం ఎక్కువేం కాదని ముందడుగు వేశాడు. సినిమాలోని సన్నివేశాలను తలపించేలా రాజుకుమార్ కేసరి అనే ఒక తండ్రి 10 ఏళ్ల తన కూతురు సలోనిని పాముల ముప్పు నుంచి రక్షించాడు. అత్యంత విషపూరితమైన రెండు పాములతో బాలిక సలోని మెడకు చుట్టుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న చిన్నారి ఆ పాములను గమించలేదు. రాత్రి కావడంతో తల్లిదండ్రులు కూడా గమనించలేకపోయారు. రాత్రంతా అలాగే గడిచిపోయింది. అయితే, మరుసటి రోజు ఉదయం కూతురు సలోని నిద్రలేపడానికి దగ్గరిగా వెళ్లిన తల్లి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. కూతురు మెడకు చుట్టుకొని ఉన్న పాములను చూసి తీవ్రమైన షాక్‌కు గురైంది. ఒక్కసారిగా కేకలు పెట్టి విషయాన్ని భర్తకు చెప్పింది. భార్య అరుపు విని రంగంలోకి దిగిన రాజు కుమార్ కేసరి కూతుర్ని కాపాడుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

Read also- Viral News: బాలుడిని హోటల్‌కు తీసుకెళ్లి ఇంగ్లిష్ టీచర్ చేసిన పనిది!

గదిలోకి పరుగెత్తుకెళ్లివెనుకాముందు ఆలోచించుకోకుండా ఉత్త చేతులతో పాములను నోళ్ల వద్ద పట్టుకొని గట్టిగా నొక్కిపట్టి చంపేశాడు. తన సేఫ్టీ చూసుకోకుండానే చేతులతో పట్టుకొని పాముల్ని నలిపివేశాడు. ఇంత జరుగుతున్నా బుజ్జితల్లి సలోని అప్పటికి కూడా గాఢనిద్రలోనే ఉంది. చిన్నారికి మెలకువ వచ్చేలోపే తండ్రి పాముల్ని చంపేశాడు. అదృష్టం బావుండడంతో రాజుకుమార్ కేసరికి కూడా ఏమీ కాలేదు.

కూతుర్ని కాపాడుకునేందుకు రాజు చూపిన తెగువ అతడిని ఒక హీరోగా నిలిపింది. అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కూతుర్ని ప్రాణగండం నుంచి కాపాడుకున్నావ్ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు. కాగా, చిన్నారి సలోనిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లి చెకప్ చేయించారు. ఆమెకు ఎలాంటి హాని జరగలేదని అక్కడి వైద్యులు నిర్ధారించారు. మరిన్ని పరీక్షల కోసం దగ్గరిలో ఉన్న మగధ్ మెడికల్ కాలేజీకి పంపించారు. అక్కడ కూడా పాము కరిచినట్టుగా శరీరంలో ఎలాంటి ఆనవాళ్లు లేవని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Read also- Trapit Bansal: టాలెంట్‌ కింగ్.. రూ.853 కోట్ల బోనస్‌తో జాబ్ ఆఫర్!

ఈ షాకింగ్ ఘటనపై రాజు కుమార్ కేసరి మీడియాతో మాట్లాడాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోయామని, తన భార్య ఉదయం మేల్కొని సలోని నిద్రలేపాలని చూడగా మెడ చుట్టూ రెండు పాములు చుట్టుకుని ఉండడాన్ని చూసిందని వివరించాడు. ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టిందని, అరుపులు విన్న వెంటనే తాను గదిలోకి పరిగెత్తానని చెప్పారు. ‘‘ నా బిడ్డ అప్పటికి గాఢ నిద్రలో ఉంది. రెండు పాములు ఆమె మెడ చుట్టూ చుట్టుకొని ఉన్నాయి. నేను తక్షణమే స్పందించాను. నేను పాముల్ని పట్టుకునే వరకు సలోనిని కదలకుండా పట్టుకోమని చెప్పాను. చిన్నారి అటుఇటు కదలకుండా సలోని కాళ్లను నా భార్య పట్టుకుంది. అప్పుడు, నేను రెండు పాములను నోళ్ల వద్ద పట్టుకుని మెడకు చుట్టుకొని ఉండగానే గట్టిగా నొక్కినొక్కి చంపేశాను’’ అని రాజు కుమార్ కేసరి వివరించారు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?