Alleti maheshwar reddy: తెలంగాణలో త్వరలో బీఆర్ఎస్ లో మరొక చీలిక రాబోతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. హరీష్ రావు నేతృత్వంలో ఈ రెండో చీలిక జరగబోతోందన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్‌లో అనేక అవమానాలు, అవహేళన ఎదుర్కొంటున్నారని ఏలేటి చెప్పారు. త్వరలోనే హరీశ్ రావు తన స్టాండ్‌ను ప్రకటిస్తారని అనుకుంటున్నట్లుగా ఆయన మీడియాకు వెల్లడించారు. కుటుంబ కలహాలతో బీఆర్ఎస్ నాలుగు ముక్కలాటగా మారిందన్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు.
కవిత లేఖలో ఆవేదన
కేటీఆర్ విదేశీ టూర్‌లో ఉన్నప్పుడే మేజర్ ఇష్యూ బీఆర్ఎస్‌లో జరగబోతుందంటూ తాను ముందే చెప్పానని గుర్తుచేశారు. కవిత లేఖలో ఆవేదన కనిపిస్తోందని, కవిత ఎదగడం కేటీఆర్‌కు ఇష్టం లేదన్నారు. ఆస్తుల పంపకంలో సైతం కవితకు అన్యాయం జరుగుతోందని ఆవేదన ద్వారా తెలుస్తోందన్నారు. కవిత ప్రస్టేషన్లో బీజేపీతో పొత్తు అంటూ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తోందని చురకలంటించారు. అవినీతి పార్టీలను విలీనం చేసుకునే పద్ధతి బీజేపీలో లేదని ఏలేటి వ్యాఖ్యానించారు. బీఆర్ఎఎస్ ను విలీనం చేసుకునే అవసరం బీజేపీకి ఏమాత్రం లేదన్నారు.
Also Read: Ranga Reddy district: రెవెన్యూ’లో అవినీతి దందా.. ఉన్నతాధికారులే పాత్రధారులు!
కేటీఆర్ కోవర్ట్‌గా అనుమానం
కవిత రెండ్రోజుల్లో తన తండ్రికి మరో లేఖ రాయబోతోందని జోస్యం చెప్పారు. కోవర్టులు తమ పార్టీలో ఎవరూ లేరని, కవితకు వాళ్ళ అన్న కేటీఆర్ కోవర్ట్‌గా అనుమానం ఉందేమోనని ఎద్దేవాచేశారు. కవిత సొంత పార్టీ పెట్టుకుంటుందా? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా? అనేది తెలియాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ పతనం వైపుగా వేగంగా పరిగెడుతోందన్నారు. సొంత పార్టీలో ఎదుగుదల లేదని కవిత ఇప్పటికే డిసైడ్ అయిందని ఏలేటి తెలిపారు. ఎదేమైనప్పటికి కవిత లేఖతో బీఆర్ఎస్ రాజకీయంలో ప్రకంపణలు సృష్టించిందని అన్నారు.
Also Read: Corporators: ఆగని కార్పొరేటర్ల ఆగడాలు.. భార్యల పదవులతో రెచ్చిపోతున్న భర్తలు!