Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం కుక్క కరిస్తే కూడా సూది మందు లేని పరిస్థితులు ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సమకూర్చిన కోటి యాభై లక్షల రూపాయల విలువైన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభించారు.
Also Read: Bandi Sanjay: హిందుత్వమే నా శ్వాస.. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాం.. బండి సంజయ్
వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధులతోనే ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నప్పటికీ, ఇక్కడికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు సూది మందు సహా కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా, గత నెలలో మొంథా తుఫాను ప్రభావంతో పంట నష్టపోయిన మహిళా రైతు తారవ్వను మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ రమేశ్ రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, ఎమ్మార్వో లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Etela vs Bandi Sanjay: కులం మతంతో రాజకీయాలు నిలబడవు.. బండి వర్సెస్ ఈటల వార్..!

