Rachakonda Police: మహిళలు, బాలికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు(Sudeer Babu) చెప్పారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జులాయిల నుంచి ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే రాచకొండ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆవారాల ఆట కట్టించటానికి షీ టీమ్స్ బృందాలు సివిల్ దుస్తుల్లో బస్టాండులు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లలో డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల మొదటి 15 రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో 310మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 181మంది మేజర్లు ఉండగా, 129మంది మైనర్లు ఉన్నారు.
స్నానం చేస్తుండగా..
ఓ మహిళ తిరుమలకు వెళ్లే ముందు స్నానం చేస్తుండగా బాత్రూం కిటికీ నుంచి వ్యక్తి మొబైల్ ఫోన్ తో ఫోటోలు తీశాడు. అది గమనించిన మహిళ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. అయితే, వాళ్లు బయటకు వచ్చేలోపే అగంతకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
Also Read: Sadha father death: తండ్రి మరణంపై హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్.. వారం ఓ యుగంలా..
పెళ్లి చేసుకొమ్మని..
మరో ఉదంతంలో యువతి బంధువు నిన్ను పెళ్లి చేసుకుంటా.. నా కోరికలు తీర్చు అని వెంటపడి వేధిస్తున్నాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువ అవుతుండటంతో బాధితురాలు షీ టీమ్స్(She Teams) సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన షీ టీం సిబ్బంది నిందితున్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితునికి అప్పటికే పెళ్లయి ఓ కుమారుడు కూడా ఉన్నట్టు వెల్లడైంది. ఇలా సోషల్ మీడియా(Social Media), సెల్ ఫోన్ల ద్వారా, నేరుగా వేధింపులకు పాల్పడ్డ వారిని షీ టీమ్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. వీరిలో ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టీ.ఉషారాణి తెలిపారు.
రాచకొండ వాట్సాప్ నెంబర్
98మందిపై పెట్టీ కేసులు పెట్టినట్టు చెప్పారు. 210మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు, సీఐ అంజయ్య, ఎస్ఐ రాజు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. పోకిరీల నుంచి వేధింపులు ఎదురైతే రాచకొండ వాట్సాప్ నెంబర్ 8712662111కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బోనగిరి ప్రాంతంలో ఉంటున్నవారు 8712662598, చౌటుప్పల్ పరిసరాల్లో ఉండేవారు 8712662599, ఇబ్రహీంపట్నం వాసులు 8712662600, కుషాయిగూడ ప్రాంతానికి చెందిన వారు 8712662601, ఎల్బీనగర్ పరిసరాల్లో ఉంటున్న వారు 8712662602, మహేశ్వరం ప్రాంతానికి చెందిన వారు 8712665299, మల్కాజిగిరి వాసులు 8712662603, వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వారు 8712662604, యాదాద్రికి చెందిన వారు 8712665300 నెంబర్లకు ఫిర్యాదులు ఇవ్వాలని చెప్పారు.
Also Read: Gajwel flood: అక్రమ వెంచర్ల వల్లే రోడ్లు, కాలనీలు ముంపు.. బీజేపీ నేతల నిరసన