HYD-Water-Supply (Image source Twitter)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Water Supply: హైదరాబాదీలకు అలర్ట్.. 27, 28 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం.. ఎక్కడెక్కడంటే?

Water Supply: 27,28 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం

ప్యారడైజ్ జంక్షన్‌లో పైప్ లైన్ విస్తరణ పనులే కారణం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్ వరకు (ఎన్ హెచ్–44) ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఉన్న జలమండలికి చెందిన 800 మి.మీ డయా ఎంఎస్ పైప్‌లైన్ విస్తరణ పనులు జరగనున్నాయి. ఈ కారణంగా అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు ప్రాంతాల్లో నీటి సరరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు (Water Supply) జలమండలి శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మారేడ్ పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఉన్న ఎంఎస్ పైప్‌లైన్‌ను కొత్తగా వేసిన పైప్‌లైన్‌తో స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానించేందుకు హెచ్ఎండీఏ ఈ పనులను చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ కారణంగా ఈ నెల 27వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజైన 28వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 18 గంటల ఈ పనులు కొనసాగుతాయని, దీంతో, ఈ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లోని నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి తెలిపింది.

Read Also- Girls At Wines: స్కూల్ యూనిఫాంలో వైన్‌షాప్‌కు వెళ్లి మద్యం కొన్న బాలికలు.. నిర్ఘాంతపోయే ఘటన

అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే

నల్లగుట్ట, ప్రకాశ్‌నగర్, మేకలమండి, బౌద్ధనగర్, శ్రీనివాసనగర్, పాటిగడ్డ రిజర్వాయర్ పరిధి ప్రాంతాలతో పాటు భోలక్ పూర్, కవాడిగూడ, సీతాఫల్ మండి, అలాగే హస్మత్‌పేట్, ఫీరోజ్‌గూడ, గౌతమ్‌నగర్, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్, బేగంపేట్ విమానాశ్రయం, బాలంరాయి పంప్‌హౌజ్, బాలంరాయి చెక్‌పోస్ట్, బోయిన్‌పల్లి, ఏఓసీ రైల్వే కాలనీ (సికిందరాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని గుర్తించి, ఆయా ప్రాంతాల్లో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి కోరింది.

జలమండలి మాజీ ఉద్యోగి సత్తా

గ్రేటర్ హైదరాబాద్ వాసుల దాహర్తిని తీర్చే జలమండలిలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌‌గా విధులు నిర్వర్తించి రిటైర్డ్‌ అయిన సోమ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇటీవల గుంటూరులో నిర్వహించిన 7వ నేషనల్‌ మాస్టర్స్‌ ఆక్వాటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తన సత్తా చాటారు. 75-79 ఏజ్ గ్రూప్ క్యాటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో ఆయన ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఈ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి వంద మీటర్ల ఫ్రీ స్టైల్‌, 50 మీటర్ల ఫ్రీ స్టైల్‌, 200 మీటర్ల ఫ్రీ స్టైల్‌, 50 మీటర్ల బటర్‌ఫ్లై, ఫ్రీ స్టైల్‌ రిలే విభాగాల్లో అద్భుత క్రీడా ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి, ఈడీ మయాంక్‌ మిట్టల్ స్వయంగా ఆయనను సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిభ, క్రమశిక్షణ, క్రీడా ప్రగతి పట్ల అంకితభావం జలమండలి సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, చీఫ్ జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్‌ ట్రాన్స్‌మిషన్‌) హోదాలలో విధులు నిర్వహించి, 2006 ఆగస్టు నెలాఖరులో పదవీ విరమణ పొందారని తెలిపారు. వాటర్ బోర్డు స్థాపించిన నాటి నుంచే ఆయన తన సేవలందించారని వెల్లడించారు. 75-79 ఏళ్ల వయో విభాగంలో పోటీలలో పాల్గొని విజయం సాధించారు. 77 ఏళ్లు వయస్సులో కూడా ఆయన ఇంతటి క్రీడా ప్రతిభా కల్గి ఉండటం గొప్ప విషయమని ఈడీ మయాంక్ మిట్టల్ వ్యాఖ్యానించారు.

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్