Tragic Incident: భార్య భర్తల మధ్య గొడవ ఒకరి ప్రాణం పోయే పరిస్థితికి దారి తీసింది. తనపై తానే బ్లేడుతో దాడి చేసుకున్న భర్తను చూసి భయం తో భర్త కళ్ళేదుటే ఫ్యాన్ కు ఉరి వేసుకుని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సంతోష్ (22), దీపిక(18)లు ప్రేమ వివాహం చేసుకుని అంబర్ పేట లో నివాసం ఉంటున్నారు.
Also Read:Plane Crash: పాపం.. పెళ్లైన 5 నెలలకే.. తీవ్ర విషాదం
మరో సారి ఇద్దరి మధ్య వివాదం
వీరికి ఒక బాబు. భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇటీవల దీపిక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అమ్మ సాయి వెంకట్ రెడ్డి నగర్ లో తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. రాత్రి భర్త సంతోష్ బోడుప్పల్ కు రావడంతో మరో సారి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. సుమారు అర్దరాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. సందీప్ ఒక్కసారిగా బ్లేడు తో తనపై తానే దాడి చేసుకోవడంతో భయానికి గురైన భార్య ఏమిచేయాలో.. ఎలా ఆపాలో! తెలియక భయంతో గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు భర్త ముందే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కేసు నమోదుచేసి దర్యాప్తు
గాయాలతో ఉన్న భర్త ఆమెను నిలువరించ లేకపోయాడు. ఈ సందర్భంగా భర్త ఆపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. శబ్దాలు విని ఇరుగుపొరుగు వచ్చి పోలీసుకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భర్తను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భార్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు.
Also Read: Plane Crash: నిజంగా మిరాకిల్.. మృత్యుంజయుడు కాకపోతే మరేంటి?