Medchal District: ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను
Medchal District (image credit: swetcha reporter)
హైదరాబాద్

Medchal District: ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మేడ్చల్ ఏసీపీ!

Medchal District: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీ లోని భారత్ బైబిల్ కాలేజీలో ఎన్నికల నామినేషన్ దాఖలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బైబిల్ కాలేజీలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ సీఐ సత్యనారాయణతో కలిసి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో మూడు అంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఎన్నికల ప్రచారం నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు నొటిఫికేషన్ ను ఎవరైన అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.

Also Read: Medchal District: మున్సిపాలిటీ ఎన్నికలకు మోగిన నగారా.. నామినేషన్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

నామినేషన్ల స్వీకరణకు భారీ స్పందన

మేడ్చల్ జిల్లాలో మూడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు సమర్పించారు.ఎల్లంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ 3,బీజేపీ 1 నామినేషన్ దాఖలు చేయగా, ముడిచింతలపల్లి 5 కాంగ్రెస్ 5, బిఆర్ఎస్ 3, బీజేపీ 1,అలియాబాద్ మున్సిపల్ లో కాంగ్రెస్ 7, బి ఆర్ఎస్ 5,బీజేపీ 2,జనసేన 2 మొత్తం మీద మూడు మున్సిపల్ కలిపి 29 నామినేషన్ వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రచాంతంగా కొనసాగుతుందని ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Also Read: Medchal District: మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్ డిప్యూటీ వార్డెన్ సస్పెండ్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?