Medchal District: శామీర్పేట్‌లో పురుగుల అన్నం పెడుతూ.. విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ గురువారం మహాత్మ జ్యోతి పూలే తెలంగాణ బిసి రెసిడెన్షియల్ (బాయ్స్) హాస్టల్(Mahatma Jyoti Phule Telangana BC Residential Hostel) విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఈ సంఘటనకు సంభందించి కొంతమంది నాయకులు శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఉత్తర్వులు జారీ..
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్‌లోని మహాత్మ జ్యోతి పూలే తెలంగాణ బిసి రెసిడెన్షియల్ (బాయ్స్) హాస్టల్ విద్యార్ధులకు పురుగుల అన్నం పెడుతున్నట్టు హస్టల్ విద్యార్ధులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ జిల్లా బిసి వెల్ఫేర్ అధికారులు హాస్టల్ చేరుకొని విచారణ జరిపారు. విచారణలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం నిజమే అని విచారణలో అధికారులు తెలిపారు. అంతే కాకుండా హస్టల్‌లోని విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో హాస్టల్ డిప్యూటీ వార్టెన్ ఓం ప్రకాష్(Om Prakash)ను సస్పెండ్ చేస్తూ గురుకులాల సెక్రెటరీ అధికారీ సైదులు(Saidulu) సస్పెడ్ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంలో అక్కడి అధికారులు విరమించారు.
Also Read: Ankam Jyoti: అంకం జ్యోతి ఫౌండేషన్‌కి అరుదైన సేవ భారతి అవార్డ్ అందజేత!

