Duddilla Sridhar Babu ( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

Duddilla Sridhar Babu: లైఫ్ సైన్సెస్ రంగంలో.. రూ.54 వేల కోట్ల పెట్టుబడులు

Duddilla Sridhar Babu: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో లైఫ్ సైన్సెస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. డిసెంబరు 2023 నుంచి ఇప్పటి వరకు ఈ రంగంలో రూ.54 వేల కోట్ల పెట్టుబడులు సాధించి గ్లోబర్ లీడర్‌గా ఎదిగిందని తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం తెలంగాణా లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ ఆరో బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లైఫ్ సెన్సెస్‌లో భాగమైన ఔషధ తయారీ, మెడికల్ టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి రంగాల్లో కొత్తగా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సృష్టించగలిగామన్నారు.

 Also Read: Duddilla Sridhar Babu: సెమీ కండక్టర్ల తయారీ.. డిజైనింగ్ లో యువతకు శిక్షణ!

ఆర్థిక వ్యవస్థను 250 బిలియన్ డాలర్లకు

ప్రపంచంలోని అతిపెద్ద 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలబడిందని, దేశంలో ఈ ఘనత సాధించించిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని వివరించారు. లిల్లీ, యామ్ జెన్, ఎంఎస్‌డీ, జోయెటిస్, ఎవర్ నార్త్, ఒలింపస్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నాయన్నారు. త్వరలో తెలంగాణా నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తామని, పరిశ్రమలను పెద్ద ఎత్తున ఆకర్షించే అత్యుత్తమ విధానంగా ఉంటుందన్నారు. 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 250 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. దీనితో ఏసియా లైఫ్ సెన్సెస్ రాజధానిగా తెలంగాణా శిఖరాగ్రానికి చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు.

 Also Read: Duddilla Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. మీ కోసమే పారిశ్రామిక పార్కులు.. ఎక్కడంటే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ