Hyderabad News: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదం ప్రజలను కలచివేసిన విషయం తెలిసిందే. వాహనదారుడు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృత్యువాత పడ్డ ఘటన మరవక ముందే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్థానిక సామాజిక సేవకుడు మహమ్మద్ కరీం(Muhammad Karim) ముందుకొచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో ఆయన తన స్వంత ఖర్చుతో రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాలకు (“Go Slow”) గో స్లో అనే స్టిక్కర్లు అతికించడం ప్రారంభించారు.
Also Read: Vice President Election: రేపే ఎన్నిక.. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు?.. క్రాస్ ఓటింగ్ టెన్షన్!
భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో
వాహనదారులు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలనే అవగాహన కల్పించడమే తన ముఖ్య ఉద్దేశమని కరీం తెలిపారు. ప్రాణం అమూల్యం అయినదని చిన్న జాగ్రత్తతో పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు అని ఆయన అన్నారు. ఈ ప్రయత్నం ద్వారా రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించే అలవాటు పెరుగుతుందని నమ్ముతున్నాను అని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తాను అని ఆయన పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆయన ఈ చొరవను అభినందిస్తూ, “ప్రభుత్వ విభాగాలు, ప్రజా ప్రతినిధులు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేయూతనివ్వాలి” అని కోరుతున్నారు.
చిన్న ప్రయత్నమే అయినా సమాజంలో అవగాహన పెంచి ప్రాణాలను కాపాడగల సామర్థ్యం ఉందని, మహమ్మద్ కరీం ఆదర్శంగా నిలుస్తున్నారని వారు పేర్కొన్నారు.“గో స్లో – సేవ్ లైఫ్” అనే నినాదంతో కరీం ప్రారంభించిన ఈ కార్యక్రమం సమాజంలో కొత్త చైతన్యాన్ని నింపుతుందని ఆశిస్తున్నారు.
Also Read: Red Sea cable cut: ఎర్ర సముద్రంలో కేబుల్స్ కటింగ్.. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం!