Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: ఆ కార్యాలయంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. పట్టించుకోని అధికారులు

Mahabubabad District: ఈ కార్యాలయం మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి తహసిల్దార్ కార్యాలయమేనని నమ్మండని వేడుకుంటున్న అక్కడి ప్రజలు మాత్రం నమ్మలేకపోతున్నారు. గత బిఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో హడావిడిగా ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఉత్తర్వులు జీవో చేసి మమా అనిపించారు. అక్కడ తహసిల్దార్ కార్యాలయానికి సరైన వసతులు లేకపోవడంతో అక్కడ అధికారులు ఎవరూ ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పటి ఎమ్మెల్యే శంకర్ నాయక్(Shankar Nayak) పక్క నియోజకవర్గం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్(Redyanayak) తన శాయశక్తుల ప్రభుత్వాన్ని ఒప్పించి డోర్నకల్ మండలంలో ఉన్న సీరోలును మండల కేంద్రంగా చేసుకున్నారు. నేనేమైన తక్కువ నా అంటూ మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే సైతం ప్రభుత్వంపై తనదైన శైలిలో ఫైరవీ చేసి ఇనుగుర్తిని మండల కేంద్రంగా చేయించుకున్నారు.

ప్రజలు ఇబ్బందులు

మండల కేంద్రంగా అవతరించిన తర్వాత ఇనుగుర్తి లో తహసిల్దార్(MRO Office) కార్యాలయాన్ని ప్రారంభించి మండల కేంద్రంగా చెప్పుకున్నారు. అయితే మండల కేంద్రం అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన కార్యాలయాలు, పోలీస్ స్టేషన్(police Station) ఇప్పటివరకు అతిలేదు.. గతిలేదు. తహసిల్దార్ కార్యాలయంలో పనులు చేయించుకోవాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే పోలీస్ స్టేషన్ పరంగా చూస్తే కేసముద్రం పోలీస్ స్టేషన్ ను బాధితులు ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మండలం అయినప్పటికీ మండల కేంద్రంలో అందాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read; Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

కార్యాలయలో అస్తవ్యస్తంగా పారిశుధ్యం

పేరుకే అది మండల కేంద్రం. అక్కడ అధికారులు ఎవరూ కనిపించరు. ప్రజలకు కావాల్సిన పనులు చేయరు. ఎప్పుడొస్తారో.. తెలియదు. ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు. అయితే మండల కేంద్రంలో ప్రజలకు కావాల్సిన పనులను ఎవరు చేస్తారో… అర్థం కాని దుస్థితి. ఇకపోతే కార్యాలయం కార్యాలయం లాగా లేకపోవడంతో చిన్నపాటి పనులు చేయించుకునేందుకు తహసిల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తే అక్కడ అస్తవ్యస్తంగా పేరుకుపోయిన పారిశుద్ధ్య మాత్రమే దర్శనమిస్తుంది. తహసిల్దార్ కార్యాలయం పక్కనే గ్రామపంచాయతీ కార్యాలయం ఉండడంతో చుట్టూ ప్రహరీ గోడ ఆనుకుని మురుగునీరు పారుతుంది.

ముక్కులు అదిరేలా దుర్వాసన

గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ముక్కులు అదిరేలా దుర్వాసన వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది దుర్వాసన చూసేందుకేనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనుచూపు మేర లోనే డంపింగ్ యార్డ్(Dumping yard) ను తలపించేలా చెత్తాచెదారంతో కార్యాలయం దర్శనమిస్తుంది. దీంతో కోతుల బెడద ఎక్కువ కావడంతో కార్యాలయానికి వివిధ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సి వస్తుంది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్(MLA Murali Nayak), ఎంపీ బలరాం నాయక్(MP Balaram Nayak), ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి(Pongileti Srinivas Reddy) ప్రత్యేక దృష్టి సారించి ఇనుగుర్తి మండలంలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read; Mahesh Kumar Goud: బండి సంజయ్ బీసీ కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Just In

01

Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!

Chris Gayle: పంజాబ్ కింగ్స్ జట్టుపై క్రిస్ గేల్ సంచలన ఆరోపణలు

Asha Worker Award: ఆశా వర్కర్ సోయం జయమ్మ కు.. ఉత్తమ సేవా అవార్డు!

Teja Sajja: అనుదీప్ గురించి నిజాలు బయట పెట్టిన తేజ సజ్జా!.. అలా చెప్పేశాడేంటి భయ్యా..

Dr. Jeevan Chandra: నిత్య కృషీవలుడు..పేద ఇంట్లో వికసించిన జ్ఞాన దీపం.. జీవన్ చంద్ర!