Mahesh-Kumar-Goud
తెలంగాణ, నిజామాబాద్

Mahesh Kumar Goud: బండి సంజయ్ బీసీ కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మున్నూరు కాపు బిడ్డ అని చెప్పుకునే బండి సంజయ్ బీసీల ద్రోహిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసలు ఆయన బీసీ కాదని, దేశ్‌ముఖ్ అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బండి సంజయ్ ప్రజల్లోకి రావాలని సవాలు విసిరారు. ప్రధాని మోదీని అడ్డుపెట్టుకొని బీసీ రిజర్వేషన్‌ను ఆపుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవటం ఖాయమని, అప్పుడు బీసీ రిజర్వేషన్ ఎలా ఆపుతారో చూస్తామని అన్నారు. బీసీ పౌరుషం ఉంటే బీసీ బిల్లును చట్టబద్ధత కోసం ప్రయత్నించాలని బండి సంజయ్‌కు సవాలు విసిరారు.

ఇక, ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితను జిల్లా కోడలుగా అభిమానిస్తామని, కానీ, లిక్కర్ రాణిగా ద్వేషిస్తామని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాళేశ్వరం అవినీతి జరిగిందనడానికి కవిత మాటలు నిదర్శనమన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి దోచుకున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటాల్లో తేడా కారణంగానే విభేదాలు భగ్గుమన్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కవిత ఈ మాటలన్నీ అని ఉంటే సన్మానం చేసేవాళ్లమని, కవితతో కేసీఆర్ డ్రామా ఆడిస్తున్నట్టుగా అనుమానం కలుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండబోదని ఏడాది క్రితమే చెప్పానని, ప్రస్తుతం అదే జరుగుతోందని చెప్పారు.

Read Also- Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్

ఈనెల 15న కామారెడ్డి వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ’ సన్నాహక సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రతిపక్షాల భరతం పట్టే వేదికగా ఈ సభ నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రతి పక్షాల భరతం పట్టేందుకు బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ అని, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగొచ్చేలా కామారెడ్డి సభ నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు కనువిప్పు కలిగేలా ఈ సభ ఉంటుందన్నారు. దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు బీజేపీ నేతలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఉదయం లేస్తే దేవుళ్లు చుట్టూ తిరిగి ఓట్లు అడుక్కుంటారని, బీజేపీ నేతల మాదిరిగా తాము ఓట్లు అడుక్కోలేదని అన్నారు. ఈటల రాజేందర్ ముఖం చాటేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Read Also- Crime News: బావిలో భర్త డెడ్‌బాడీ.. కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

లిక్కర్ రాణిగా నిజామాబాద్‌కి కవిత చెడ్డ పేరు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటాల పంపకాల్లో తేడాల వల్లే కేసిఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అంతా దొంగల ముఠా అని, రాష్ట్రాన్ని దోచుకున్నామని కవిత స్వయంగా అంగీకరించటం హర్షణీయమని ఎద్దేవా చేశారు. కానీ, ఈ విషయం ఐదేళ్ల ముందే చెబితే సన్మానించేవాళ్లమని ఛమత్కరించారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ కనుమరుగవుతుందని విమర్శించారు. సమానత్వానికి కాంగ్రెస్ పార్టీ మారు పేరు టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?