Crime News: మధ్యప్రదేశ్‌లోని అనుప్పుర్ జిల్లా సాకరియా అనే గ్రామంలో షాకింగ్ నేరం (Crime News) బయటపడింది. బస్తాలు, దుప్పట్లలో చుట్టివున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని ఒక బావిలో గుర్తించారు. తొలుత ఒక సాధారణ హత్య కేసు అని అందరూ భావించారు. కానీ, దర్యాప్తులో భారీ కుట్ర బయటపడింది. మృతుడి మూడవ భార్య, తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. బావిలో డెడ్‌బాడీని గుర్తించింది రెండవ భార్య (నిందితురాలి అక్క) అని వివరించారు. మృతుడి పేరు భయ్యాలాల్ రజాక్ అని, అతడి వయసు 60 ఏళ్లు అని పోలీసులు తెలిపారు. భయ్యాలాల్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య వదిలిపెట్టిన తర్వాత, రెండో భార్యగా గుడ్డీబాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగలేదు. పిల్లల్ని కనాలనే కోరికతో గుడ్డీబాయి చెల్లెలు మున్నీని భయ్యాలాల్ పెళ్లి చేసుకున్నాడు. మున్నీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, స్థానికంగా ప్రాపర్టీ డీలర్ అయిన నారాయణదాస్ కుశ్వాహా అనే వ్యక్తితో మున్నీకి శారీరక సంబంధం ఏర్పడింది.
ఈ సంబంధం బాగా ముదిరిపోవడంతో భయ్యాలాల్‌ను హత్య చేసి అడ్డుతొలగించుకోవాలని మున్నీ, నారాయణదాస్ స్కెచ్ వేశారు. పథకం ప్రకారం, 25 ఏళ్ల వయసున్న ధీరజ్ అనే కూలీని హత్య కోసం పురమాయించారు. ప్లాన్ ప్రకారం, ఆగస్టు 30 రాత్రి, భయ్యాలాల్ హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో భయ్యాలాల్ నిద్రపోతుండగా, నారాయణదాస్, ధీరజ్ దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించి ఒక ఇనుప రాడ్‌తో భయ్యాలాల్ తలపై బలంగా కొట్టారు. దీంతో, అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ఒక బస్తాలో పెట్టి, దానికి దుప్పటి, చీరలు, ఇతర వస్త్రాలు చుట్టి తీసుకెళ్లి గ్రామంలో ఉన్న బావిలో విసిరేశారు.
Read Also- Pookalam Controversy: పూలరంగవల్లిలో ఆపరేషన్ సిందూర్‌పై వివాదం.. 27 మందిపై కేసు
మరుసటి రోజూ ఉదయం బావిలో అనుమానాస్పదంగా ఏదో తేలియాడుతున్నగా భయ్యాలాల్ రెండో భార్య గుడ్డీబాయి గుర్తించింది. మృతదేహం అని గుర్తించి షాక్‌కు గురైంది. ఈ వార్త గ్రామంలో కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బావిలోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి, భయ్యాలాల్ మృతదేహం బయటకు తీశారు. అతడి మొబైల్ ఫోన్‌ను కూడా బావిలో దొరికితే బయటకు తీశారు.
అయితే, పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భయ్యాలాల్ తలపై తీవ్ర గాయాల కారణంగా చనిపోయినట్టు నిర్ధారణ అయింది. దీంతో, దర్యాప్తు మొదలుపెట్టిన కోట్వాలి పోలీసులు 36 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మోతి ఉర్ రెహ్మాన్ మీడియాతో మాట్లాడారు. ‘‘భయ్యాలాల్ మృతదేహాన్ని బస్తాలలో బంధించి బావిలో విసిరినట్టుగా గుర్తించాం. అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడవ భార్య మున్నీ అలియాస్ విమ్లా.. నారాయణ్ దాస్ కుశ్వాహా అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారంలో కూలీ ధీరజ్‌తో కలిసి వారు భయ్యాలాల్‌ను ఇనుప రాడుతో కొట్టి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని బావిలో పడేశారు. మొబైల్ ఫోన్‌ను కూడా బావిలోనే పడేశారు. దానిని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తవుతోంది’’ అని ఎస్పీ వివరించారు.
Read Also- CM Revanth Reddy: వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంతో ముఖ్యమంత్రి హర్షం
