CM Revanth Reddy (imagecredit:twiter)
తెలంగాణ

CM Revanth Reddy: వినాయక నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగియడంతో ముఖ్యమంత్రి హర్షం

CM Revanth Reddy: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మోత్తం తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి పేర్కొన్నారు.

అత్యంత భక్తి శ్రద్ధలతో

రాష్ట్రంలో తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహాకులు, క్రేన్ ఆపరేటర్లు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియచేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

Also Read: Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

ముఖ్యమంత్రి అభినందనలు

పదకొండు రోజుల పాటు భక్తుల నుంచి ఘనమైన పూజలందుకున్న గణనాధుడికి మహానగరవాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వీడ్కోలు పలికారు. గణపతి బొప్పా మోరియా.. జై భోలో గణేష్ మహారాజ్ కీ జై…జై.. జై.గణేశా… బై బై గణేశా.. వెళ్లిరా..మళ్లీ రా గణపయ్య అంటూ భక్తులు చేసిన నినాదాలతో భాగ్యనగరం పులకించింది. గ్రేటర్ లోని మూడు పోలీసు కమిష్నరేట్ పరిధిలో నిమజ్జనం జరుగుతుండటంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. బ్యాండే మేళాలు, గల్లీగల్లీలో తీన్మార్ స్టెప్పులు, విచిత్ర వేషధారణలతో, ఆటలు, పాటలతో నిమజ్జనోత్సవాన్ని ఘనంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు. గణనాధుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడిలోకి చేర్చారు. గణేశ్ నిమజ్జన సంబరాలు మహానగరంలో శనివారం అంబరాన్నంటాయి. నగరవాసులు ఈ సారి మరింత రెట్టింపు ఉత్సాహాంతో నిమజ్జనానికి రికార్డు స్థాయిలో జనం తరలి వచ్చారు.

ఖైరతాబాద్ గణపయ్య

దీంతో సాగర తీరం జన సంద్రంగా మారింది. మహానగరంలోని గల్లీ గల్లీలు, వాడలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహానగరంలో ఎటు చూసినా ఆది దేవుడ్ని స్మరించే నినాదాలే. ముఖ్యంగా నగరంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ భారీ గణపయ్యలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలన్న పోలీసుల వ్యూహాం కాస్త ఆలస్యమైన మొత్తానికి ఫలించింది. ఉదయం ఆరున్నర గంటలకు ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనం కోసం సాగర్ వైపు తరలగా, బాలాపూర్ గణనాధుడు కాస్త ఆలస్యంగా బయల్దేరినా, మధ్యాహ్నాం మూడు గంటల కల్లా పోలీసులు ఈ గణపయ్యను పాతబస్తీ దాటించారు.

Also Read: CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Just In

01

Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్

BCCI Cash Reserves: వామ్మో.. బీసీసీఐ వద్ద ఎంత డబ్బు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!

Ganesh Laddu issue: తాగిన మత్తులో గణేష్ లడ్డూను డ్రైనేజీలో పడేసిన యువకులు.. ఎక్కడంటే?

Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!

Emergency delivery: అంబులెన్స్‌లో పురుడు పోసిన 108 సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం