Pookalam Controversy: ఓనం పండుగ సందర్భంగా కేరళలోని కొల్లాం జిల్లాలో ఒక ఆలయం ముందు వేసిన పూకళం (పువ్వుల రంగవల్లి) వివాదాస్పదంగా (Pookalam Controversy) మారింది. ముతుపిలక్కలోని పార్థసారథి ఆలయం ముందు వేసిన పూకళం దిగువ భాగంలో, ‘ఆపరేషన్ సిందూర్’ అని పూలతో అందంగా రాశారు. అయితే, ఆపరేషన్ సిందూర్‌కు కాస్త పైభాగంలో ఆర్ఎస్ఎస్ (RSS) జెండా గుర్తును కూడా గీశారు. ఒక సంస్థకు చెందిన లోగోను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించడం గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆలయ కమిటీ ఫిర్యాదు చేసింది. దీంతో, ఆర్ఎస్ఎస్‌కు చెందిన 27 మంది కార్యకర్తలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహితలోని (BNS) సెక్షన్ 223 ( ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం), సెక్షన్ 192 ( ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలకు ప్రేరేపించడం, సెక్షన్ 3(5) (సమూహంగా క్రిమినల్ చర్య) సెక్షన్ల కింద కేసు నమోద చేశారు. ఆలయానికి సుమారు 50 మీటర్ల దూరంలో ఛత్రపతి శివాజీ ఫ్లెక్సీ బోర్డు కూడా ఏర్పాటు చేశారని, రాజకీయ వర్గాల మధ్య ఘర్షణ పెట్టాలనే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
Read Also- Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు
నిషేధించిన హైకోర్టు
ఇంతకుముందు కూడా పండుగల సమయంలో ఆలయానికి సమీపంలో జెండాలు ఏర్పాటు చేయడంపై ఘర్షణలు జరిగేవని, ఇలాంటి ఘర్షణలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తాము హైకోర్టును ఆశ్రయించామని కమిటీ సభ్యుడు మోహనన్ తెలిపారు. దీంతో, ఆలయ ప్రాంగణం చుట్టూ ఎలాంటి అలంకార వస్తువులు, జెండాలు కట్టరాదని, ప్రదర్శించకూడదంటూ 2023లో హైకోర్టు నిషేధం విధించిందని ఆయన ప్రస్తావించారు. కానీ, హైకోర్టు ఆదేశాలను అతిక్రమిస్తూ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారి సంస్థ జెండాతో పాటు ‘ఆపరేషన్ సిండూర్’ అనే పదాలను పువ్వులతో అలంకరించి, ఆలయ కమిటీ వేసిన పూకళం పక్కనే మరో పూకళం వేశారని మోహనన్ తప్పుబట్టారు. ఈ విధంగా వ్యవహరించడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాక, ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని, అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై తమకు అపారమైన గౌరవం ఉందని అన్నారు. నిందితులు చెబుతున్నట్టుగా ఆపరేషన్ సిందూర్‌పై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేయదలచుకున్నామని అని ఆలయ కమిటీ సభ్యుడు సీ.అశోకన్ తెలిపారు. కాగా, ఆలయ కమిటీ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓనం వేడుకలలో భాగంగా వేసిన పూకళాన్ని కూడా పరిశీలించారు.
కేరళ పోలీసులపై బీజేపీ విమర్శ
ఆలయ కమిటీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఇది ‘ఆపరేషన్ సిందూర్’కు గౌరవసూచకంగా వేసిన పూకళం అని పేర్కొంది. ఏకంగా 27 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేయడాన్ని ‘ఆశ్చర్యకరమైనదిగా’ బీజేపీ అభివర్ణించింది. ఈ మేరకు కేరళ పోలీసులపై తీవ్రంగా విమర్శలు గుప్పించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేరళను జమాత్-ఈ-ఇస్లామీ పాలిస్తోందా?, లేక పాకిస్థాన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఉందా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోకపోతే, కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. ‘‘కేరళ.. భారత్‌లో గర్వించదగిన భూభాగం. కానీ, ‘ఆపరేషన్ సిందూర్’ పదాలతో పూకళం వేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది పూర్తిగా అసహ్యం కలిగించే అంశం’’ అని ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Read Also- Ganesh Chaturthi 2025: లక్ అంటే ఈ కుర్రాడిదే.. రూ.99 కే 333 కేజీల లడ్డూను సొంతం చేసుకున్నాడు?
ఆపరేషన్ సిందూర్ భారత సైనిక దళాల శౌర్యం, ధైర్యానికి ప్రతీక అని, దానిపై కేసులు నమోదు చేయడమంటే దేశ రక్షణ కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికీ అవమానమేనని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా స్పందిస్తూ, ఒక వర్గాన్ని సంతోష పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
Why is 'Operation Sindoor' allergic to some in Kerala? Kerala Police today demanded the removal of 'Athapoovu' (Onam flower arrangements) with Operation Sindoor written on them. The flower arrangements were placed by some youngsters in front of the Parthasarathy temple in… pic.twitter.com/5txAc6dp5z
— Colonel S Dinny (Retd) (@sdinny14) September 5, 2025