Cheruku Sudhakar (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Cheruku Sudhakar: తెలంగాణ మలిదశ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక భూమిక పోషించారని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Shekar Reddy) అన్నారు. యువతకు ఆదర్శం జిట్టా అని కొనియాడారు. జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) మొదటి వర్ధంతిని పురస్కరించుకొని భువనగిరిలో జిట్టా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ దవాఖానలో పండ్లు పంపిణీ చేశారు. అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటి ఫ్లోరైడ్ రహిత నీటిని అందించిన సుజల దాత జిట్టా అని, ఆయన స్పూర్తితోనే తాను సైతం నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లు నెలకొల్పానన్నారు.

Also Read: Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

తెలంగాణ మలిదశ ఉద్యమంలో

యువజనసంఘాల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని, ఎవరికి ఆపద వచ్చినా తాను ఉన్నానని భరోసాగా ఉండేవారన్నారు. ఆయన మనమధ్యలేకపోయినా చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. కొంతమంది నాయకుల అడ్డంకులతోనే రాజకీయ ఆయనకు రాజకీయంగా తీవ్ర నష్టం జరిగిందని, మంత్రి కల నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్(BRS) రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్(Cheruku Sudhakar) మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నాయకుడు అని ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.

ఊరారా కళాప్రదర్శనలు నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆంజనేయులు, పోతంశెట్టి, వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ రాజేందర్ రెడ్డి, కొల్పుల అమరేంద్ర, జిట్టా సునీత, రచ్చ శ్రీనివాస్ గౌడ్, రత్నపురం శ్రీనివాస్, చిలువూరి సత్తిరెడ్డి, యాస సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Just In

01

Manoj Manchu: డూప్స్ లేకుండా రియల్ స్టంట్స్.. మంచు మనోజ్‌పై ఫైట్ మాస్టర్ కామెంట్స్

BCCI Cash Reserves: వామ్మో.. బీసీసీఐ వద్ద ఎంత డబ్బు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!

Ganesh Laddu issue: తాగిన మత్తులో గణేష్ లడ్డూను డ్రైనేజీలో పడేసిన యువకులు.. ఎక్కడంటే?

Bandla Ganesh: దున్నేయ్.. ఇక టాలీవుడ్ నీదే.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి బండ్ల బూస్ట్!

Emergency delivery: అంబులెన్స్‌లో పురుడు పోసిన 108 సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం