Peddi Update: ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఎందుకంటే, ఈ సినిమా కోసం మెగాభిమానులు (Mega Fans) అంతగా ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ఈ సినిమాలో కనిపిస్తున్న తీరు, బుచ్చి బాబు సానా (Buchi Babu Sana)పై ఉన్న నమ్మకం, ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంటే భారీగా అంచనాలను పెంచేశాయి. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి రామ్ చరణ్ ఇందులో రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నారనేది ఇటీవల వచ్చిన ఫస్ట్ షాట్ చెప్పకనే చెప్పేసింది. నెవర్ బిఫోర్ లుక్‌లో రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం, శివరాజ్ కుమార్ వంటి నటుడు ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుండటం.. అన్నీ కూడా పాజిటివ్ పరిణామాలే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేశారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు (R Ratnavelu).
Also Read- Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?
‘రంగస్థలం’ను మించిన చిత్రం
తాజాగా ఆయన SIIMA 2025 వేడుకలో సందడి చేశారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును అందుకోవడానికి సైమా వేడుకలకు అటెండ్ అయిన ఆర్ రత్నవేలు.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘పెద్ది’ సినిమా వివరాలను తెలిపారు. అంతే, అప్పటి నుంచి ఆయన మాట్లాడుతున్న వీడియోను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రత్నవేలు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తయింది. రామ్ చరణ్ అద్భుతమైన నటన, ఆయన మాట్లాడే యాస అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. బుచ్చిబాబు ఈ సినిమాకు యూనిక్ స్టోరీని రెడీ చేశారు. ‘రంగస్థలం’ కంటే కూడా చాలా విభిన్నమైన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా కథ ఇచ్చిన స్ఫూర్తి.. నన్ను మరింతగా ముందుకు తీసుకెళుతోంది.. కచ్చితంగా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది
కుంభస్థలం కొడుతున్నాం
అంతే, ఇక మెగా ఫ్యాన్స్‌ని పట్టుకోవడం ఎవరితరం కావడం లేదు. దర్శకుడి తర్వాత సినిమా స్థాయి ఏంటనేది సినిమాటోగ్రాఫర్‌కే తెలుస్తుంది. అలాంటిది, దర్శకుడితో పాటు సినిమాటోగ్రాఫర్ కూడా ‘పెద్ది’ గురించి చెబుతుంది చూస్తుంటే.. తెలుగు చలన చరిత్రలో సరికొత్త రికార్డును ‘పెద్ది’ క్రియేట్ చేయడం తధ్యం అనేలా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అంతేనా, ఈసారి కుంభస్థలం కొడుతున్నామంటూ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో నిర్మాత వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు