Dhanush: మన తెలుగు దర్శకులను అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ హీరోలు ఎంతగానో నమ్ముతున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్‌లో వచ్చిన చిత్రాలే. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా తెలుగు దర్శకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగా, అట్లీ వంటి వారు తమ సత్తా చాటారు. మలయాళ హీరో దుల్కర్ మన తెలుగు దర్శకులను నమ్ముకుని ‘మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్’ వంటి భారీ విజయాలను అందుకున్నారు. ఇక కోలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ధనుష్ (Dhanush) కూడా తెలుగు దర్శకులపై ప్రత్యేక ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే ఆయన తెలుగు దర్శకులతో ‘సార్’ (Sir), ‘కుబేర’ (Kubera) సినిమాలు చేశారు. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడితో ఆయన సినిమా చేయబోతున్నట్లుగా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!
‘విరాటపర్వం’ దర్శకుడితో..
తెలుగు దర్శకులైన వెంకీ అట్లూరి, శేఖర్ కమ్ములతో ‘సార్’, ‘కుబేర’ వంటి సినిమాలు చేసిన ధనుష్.. ఇప్పుడు ‘విరాటపర్వం’ దర్శకుడు వేణు ఊడుగుల (Udugula Venu) దర్శకత్వంలో ఓ తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం ధనుష్ నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఇడ్లీ కడై’ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు ఆయన మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఓకే చేసినట్లుగా టాక్ నడుస్తుంది. ఇప్పుడు మరో చిత్రం తెలుగు దర్శకుడు వేణుతో చేసేందుకు ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు. ఆల్రెడీ వేణు ఆయనకు కథ చెప్పాడని, కథ నచ్చడంతో వెంటనే చేద్దామని చెప్పాడనేలా టాక్ నడుస్తుంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. వేణు ఊడుగుల విషయానికి వస్తే.. ‘నీది నాదీ ఒకే కథ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వేణు, ఆ తర్వాత రానా, సాయి పల్లవి కాంబినేషన్‌తో చేసిన ‘విరాటపర్వం’ సినిమాతో డిజప్పాయింట్ చేశారు. అప్పటి నుంచి ఆయన మరో సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు ధనుష్‌తో సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోతున్నారు.
Also Read- Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది
టాలీవుడ్ వైపే చూపు..
నిజంగా వేణు చెప్పిన కథ ధనుష్‌కి నచ్చి ఆయన ఓకే అంటే మాత్రం.. మరోసారి తెలుగు దర్శకుల సత్తా ఇదని చాటవచ్చు. ఎందుకంటే, ఇప్పటి వరకు కంటెంట్ అంటే మలయాళ ఇండస్ట్రీ పేరే వినబడేది. కానీ, కొన్నాళ్లుగా కంటెంట్‌కు మారుపేరుగా టాలీవుడ్ నిలుస్తోంది. అందుకు కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి (SS Rajamouli), సుకుమార్ (Sukumar) వంటి వారు చేసే సినిమాల కోసం యావత్ ప్రపంచం ఎంతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రజంజనం సృష్టిస్తూ వరల్డ్ వైడ్‌గా వార్తల్లో నిలుస్తుండటంతో టాలీవుడ్ కీర్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇతర ఇండస్ట్రీ నటులంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తుండటం విశేషమనే చెప్పుకోవాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు