Naresh 65 Movie Opening
ఎంటర్‌టైన్మెంట్

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Naresh65: అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ సినిమాలు చేసే సమయంలో ఆయన నుంచి వరుసగా సినిమాలు వచ్చేవి. కానీ ఈ మధ్యకాలంలో ఆయన కామెడీని పక్కన పెట్టి, నటుడిగా తనలోని విభిన్న కోణాన్ని పరిచయం చేసే చిత్రాలు చేస్తున్నారు. ‘మహర్షి’ సినిమా నుంచి ఆయనలో ఈ మార్పు మొదలైంది. ఈ క్రమంలో ఆయన నుంచి వరుస సినిమాలు రావడం కూడా ఆలస్యమవుతుంది. అలాగే హిట్ కూడా ఆయనకు పడటం లేదు. అయినా సరే తన రూటును మాత్రం మార్చలేదు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూనే ఉన్నారు. ‘నాంది, ఉగ్రం’ సినిమాలతో నటుడిగా ఓ మెట్టు ఎక్కుతూనే ఉన్న అల్లరి నరేష్.. మళ్లీ ఇప్పుడు బిజీ నటుడిగా మారారు. ప్రస్తుతం ఆయన హీరోగా చేస్తున్న సినిమాలు రెండుకు పైగా సెట్స్‌పై ఉండగా, తాజాగా మరో సినిమాకు అల్లరి నరేష్ శ్రీకారం చుట్టారు. ఈసారి విశేషం ఏమిటంటే.. తనకు ఎంతో పేరు తెచ్చిన కామెడీ జానర్‌లోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తుండటం. అల్లరి నరేష్ 65వ చిత్రంగా (Naresh65) రూపుదిద్దుకోనున్న ఈ సినిమా వివరాల్లోకి వస్తే..

Naresh65-Launch

కామెడీ గోస్ కాస్మిక్

యూనిక్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకుంటోన్న కామెడీ కింగ్ అల్లరి నరేష్.. ‘నరేష్65’తో తిరిగి కామెడీ జానర్‌లోకి వచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు చంద్ర మోహన్ (Chandra Mohan) దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్ల పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్‌తో రిఫ్రెషింగ్‌గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అని మేకర్స్ ప్రకటించడం ఈ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రం శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. సినిమా యూనిట్‌తో పాటు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read- Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

మూవీ ప్రారంభోత్సవ వివరాలివే..

ప్రారంభోత్సవ వివరాల్లోకి వస్తే.. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. ఇంకా హరీష్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ వంటి వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెయిన్‌ స్ట్రీమ్‌ కామెడీ, డిఫరెంట్ ఆఫ్‌ బీట్‌ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్‌.. ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read- Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

అల్లరి నరేష్ చేస్తున్న సినిమాలివే..

ఇప్పుడు ప్రారంభమైన సినిమా కాకుండా అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ హార‌ర్ కాన్సెప్ట్‌తో ‘12ఏ రైల్వే కాల‌నీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘ఆల్కహాల్’ అనే మరో డిఫరెంట్ చిత్రం చేస్తున్నారు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Asia Cup Prediction: ఆసియా కప్‌లో టీమిండియాతో ఫైనల్ ఆడేది ఆ జట్టే!.. ఆశిష్ నెహ్రా అంచనా ఇదే

Ganesh Immersion 2025: హైదరాబాద్‌లో 2 లక్షల 54 వేల 685 విగ్రహాలు నిమజ్జనం.. జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడి

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు