Director Krish: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా వచ్చిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టాక్ పరంగా పరవాలేదని అనిపించినా, కలెక్షన్ల పరంగా మాత్రం నిర్మాతను నిరాశకు గురిచేసింది. థియేట్రికల్‌గా ఈ సినిమా భారీ లాస్‌ని చవిచూసినా, ఇతర రైట్స్ విషయంలో మాత్రం నిర్మాత సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, ఈ సినిమా చిత్రీకరణకు తీసుకున్న సమయ ప్రభావం కారణంగా, నిర్మాత శాటిస్‌ఫై అవ్వలేని పరిస్థితి ‘హరి హర వీరమల్లు’ది. ఈ సినిమాకున్న సినిమా కష్టాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, కరోనా, డైరెక్టర్ ఛేంజ్, మధ్యలో టెక్నీషీయన్స్ ఛేంజ్.. ఇలా చాలా కారణాలే ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా 10కి పైగా సార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత వాయిదా పడటం విశేషం. ఇక ఈ సినిమాకు మొదట అనుకున్న దర్శకుడు క్రిష్ (Director Krish). ఆయన నేతృత్వంలో చాలా వరకు షూటింగ్ అయింది. కానీ, ఎక్కువ గ్యాప్స్ రావడంతో పాటు, ఆయన పర్సనల్ లైఫ్‌లో ఏర్పడిన ఇబ్బందులతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తాజాగా క్రిష్ ఈ సినిమా గురించి, తను షూట్ చేసిన మెటీరియల్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Also Read- Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!
రెండో పార్ట్‌లోనే అసలు కథ
‘హరి హర వీరమల్లు’ సినిమా చూశాను. ఒక దర్శకుడిని బట్టి కథ మారుతుంది. నేను చేసిన కథ అది కాదు. నేను రాసింది వేరే వాళ్లు తీస్తే ఒకలా ఉంటుంది. వేరే వాళ్లు రాసింది నేను చేసేటప్పడు వేరేలా ఉంటుంది. నేను ఎంత రాసినా, ఎంత చేసినా.. ఒక్కసారి జ్యోతి కృష్ణ చేతుల్లోకి సినిమా వెళ్లిన తర్వాత.. ఆ సినిమాపై ఆయన విజన్ పని చేస్తుంది. అయితే నేను చిత్రీకరించిన చాలా వరకు మెటీరియల్ ఇంకా ఉంది. అదంతా ఢిల్లీలో జరుగుతుంది. అది రెండో పార్ట్‌లో ఉండొచ్చు. నేను చేసిన చాలా మెటీరియల్ రెండో పార్ట్ కోసం ఉంచినట్లున్నారు. ఫస్ట్ పార్ట్‌లో నేను చేసింది ఒక 30 నుంచి 40 శాతం ఉంటుంది అంతే. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇంకా గొప్ప సక్సెస్ అయ్యిండాల్సింది. అలా అవ్వలేదని నాకు చిన్న బాధ ఉంది. మొదట నేను అనుకున్న కథ మారింది. అలాగే ట్రీట్‌మెంట్ కూడా మారింది. అసలు విషయం అంతా రెండో పార్ట్‌లోనే ఉంటుంది. నెమలి సింహాసనంపై వీరమల్లు నిలబడి, ఔరంగజేబుకు వార్నింగ్ ఇచ్చే సన్నివేశం చాలా బాగుంటుంది. అందుకోసం పెద్ద సెట్ వేశాం. అందులో చాలా వరకు చిత్రీకరించాం. ఆ సన్నివేశాలేవీ ఈ పార్ట్‌లో రాలేదు. అక్కడ వరకు వెళ్లడంతోనే ఫస్ట్ పార్ట్‌ని ముగించారు. రెండో పార్ట్ కథ చాలా బాగుంటుందని క్రిష్ చెప్పుకొచ్చారు.
Also Read- Anushka prostitution racket: వ్యభిచారం చేయిస్తూ అడ్డంగా బుక్కయిన నటి అనుష్కా.. ఎలా పట్టుకున్నారంటే?
‘ఘాటి’ టాక్‌తో నిరాశ
ఇక ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో అనుష్క (Anushka) ప్రధాన పాత్రలో ‘ఘాటి’ (Ghaati) అనే సినిమా సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకుంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చిన తర్వాతే ఇదొక సినిమా ఉందని అందరికీ తెలిసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. క్రిష్, అనుష్కల కాంబినేషన్‌పై ఉన్న నమ్మకంగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడగా, ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. విమర్శకులు కూడా ఈ సినిమాపై పెదవి విరిచారు. కొన్ని సన్నివేశాల వరకు ఓకే కానీ, కథలో కొత్తదనం లేదని, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటంతో.. ప్రేక్షకులు అంతగా ఈ సినిమాపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు వస్తున్న టాక్, కలెక్షన్లతో చిత్ర టీమ్ నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు