Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న హీరోయిన్లలో డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కూడా ఒకరు. ఈ భామ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తోంది. ఆ మధ్య వరసగా ఎక్కడ విన్నా శ్రీలీల పేరే వినిపించేది. మధ్యలో ఈ ఒత్తిడి తట్టుకోలేక రెండు మూడు సినిమాలు కూడా వదిలేసింది. ప్రజంట్ ఆమె నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కాగా, రెండోవది మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సరసన చేస్తున్న ‘మాస్ జాతర’. ఇటీవల గాలి కిరీటీ హీరోగా వచ్చిన సినిమాలో ‘వైరల్ వయ్యారి’గా దుమ్మురేపిన విషయం తెలిసిందే. ప్రజంట్ ఆమె ‘మాస్ జాతర’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. సరేలే.. అసలీ ‘ఏప్రిల్’ గోల ఏంటి? అని అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వస్తే..
Also Read- Niharika Konidela: సారీ అమ్మా! అంటూ నిహారిక పోస్ట్.. అల్లు శిరీష్ కామెంట్ వైరల్!
ఏప్రిల్ తర్వాత ఏంటి?
అప్పట్లో ఓ సినిమాలో మేక మాట్లాడుతుంది అంటూ.. ఏప్రిల్ తర్వాత ఏంటి? అని అనగానే ‘మే’ అని అనడం.. ఇంకా డౌట్ ఉంటే జూన్‌కి ముందు వచ్చే నెల ఏంటి? అంటే ‘మే’ అని మేక అనడం వంటి కామెడీ సీన్ బాగా పండింది. ఇప్పుడా కామెడీ సీన్‌ని శ్రీలీల రిపీట్ చేయడానికి ట్రై చేసి సక్సెస్ అయింది. అవును.. ‘మాస్ జాతర’ సెట్‌లో ఆమె ఓ మేక పిల్లను పట్టుకుని ‘వాట్ ఈజ్ ఆఫ్టర్ ఏప్రిల్?’ (What is after April?) అని ముసిముసిగా నవ్వుతుంటే.. ఆమె చేతిలోని మేక పిల్ల ‘మే’ అని అరవడంతో ‘కరెక్ట్’ అంటూ సరదాగా నవ్వుతోంది. ఆమె నార్మల్ శారీలో ఉండగా, ఆమె వెనుక గొర్రెల మంద ఉన్నది. ఈ వీడియో చాలా న్యాచురల్‌గా ఉండటం విశేషం. ఇక ఈ వీడియోకు పడుతున్న కామెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ‘ఏప్రిల్ తర్వాత ఏమిటో.. నీకు ఆ మాత్రం తెలియదా?’.. అంటూ సరదాగా నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. క్యూటీ.. క్యూట్ ప్రశ్న అంటూ మరికొందరు చేస్తున్న కామెంట్స్‌తో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read- The Conjuring: ఈ సినిమా చూడాలంటే కొంచెం ధైర్యం కావాలి.. పిరికివాళ్లు మాత్రం చూడకండి
సోషల్ మీడియా సెన్సేషన్
శ్రీలీల ఇలాంటి వీడియోలు చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ‘భగవంత్ కేసరి’ టైమ్‌లో కూడా ఆమె సరదాగా కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఆ తర్వాత ప్రతి సినిమాకు ఇలాంటి ఏదో ఒక సరదా వీడియో ఆమె షేర్ చేయడం, అది కాస్తా వైరల్ అవుతుండటం జరుగుతుంటుంది. రీసెంట్‌గా ‘ఉస్తాద్ భగవంత్ కేసరి’ సెట్స్‌లో జరిగిన తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ వీడియోతో మరోసారి ఆమె పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు