Jubilee Hills By Election: త్వరలో ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్(Jubilee Hills) ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్(RV Karnana) ప్రకటించారు. గత నెల 30వ తేదీన ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఓటరు తుది జాబితా ప్రకారం అపుడు నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 98 వేల 982 మంది ఓటర్లుండగా, ఓటరు జాబితా సవరణ తో 1.61 శాతం ఓట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం ఓటర్లలో 2 లక్షల లక్షల 7 వేల367 మంది పురుషులుండగా, లక్షా 91 వేల 590 మంది మహిళా ఓటర్లున్నట్లు తెలిపారు.
భారత ఎన్నికల సంఘం
వీరిలో థర్డ్ జెండర్ ఓటర్లు 25 మంది ఉన్నారు. 18 ఏళ్లు దాటి ఫారం-6 తో కొత్తగా ఓటర్లుగా వివరాలను నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు 6976 మంది ఉన్నట్లు, వీరిలో పురుషులు 3415 మంది ఉండగా, 3561 మహిళా ఓటర్లున్నట్లు జీహెచ్ఎంసీ తుది జాబితాలో పేర్కొంది. జాబితా సవరణలో భాగంగా ఫారం-7 ద్వారా 336 మంది పురుష, 327 మంది మహిళా ఓటర్ల తో కలిపి మొత్తం 663 ఓటర్ల వివరాలను తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత భారత ఎన్నికల సంఘ జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు బై ఎలక్షన్ షెడ్యూల్ ను ప్రకటించటంతో పాటు ఈ నెల 13న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అంతకు ముందే జారీ చేసిన తుది జాబితా ప్రకారం ఉన్న ఓటర్లతో పాటు నామినేషన్ల స్వీకరణ జరిగే చివరి రోజు వరకు కూడా కొత్త ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అనుమతినివ్వటంతో ఈ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది.
మొత్తం ఓటర్ల కోసం..
ప్రస్తుతం ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 4 లక్షల 1365 మంది ఉన్నట్లు, ఇందులో పురుషులు 2 లక్షల 8 వేల 561 మంది ఉండగా, మహిళా ఓటర్లు లక్షా 92 వేల 779 మంది, అలాగే థర్డ్ జెండర్ ఓటర్లు మరో 25 మందితో కలిపి మొత్తం 4 లక్షల 1365 మంది ఉన్నట్లు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు. ఈ మొత్తం ఓటర్ల కోసం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 9 పోలింగ్ స్టేషన్లలో గరిష్టంగా 1233 మంది ఓటర్లుండగా, 263 పోలింగ్ స్టేషన్లలో 540 మంది ఓటర్లున్నట్లు, ఇక 1200 కన్నా ఎక్కువ మంది ఓటర్లు 11 పోలింగ్ స్టేషన్లలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఓటరు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
జనరల్ 208561 192779 25 401365
సర్వీసు ఓటర్లు 15 3 0 18
ఎన్ఆర్ఐ ఓటర్లు 106 17 0 123
18-19 ఏళ్ల ఓటర్లు 3781 3078 0 6859
80 ప్లస్ ఓటర్లు 3281 2771 0 6053
85 ప్లస్ ఓటర్లు 1112 1022 0 2134
Also Read: Seethakka: నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
