Seethakka: జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు అభివృద్ధికి మలుపు అవుతుందని మంత్రి సీతక్క (Seethakka) వ్యాఖ్యానించారు. వరుసగా మూడు పర్యాయాలు బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించినా కనీసం మంచినీళ్లు కూడా లేవన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందన్నారు. నవీన్ ను ఆశీర్వదిస్తే అభివృద్ధి, సంక్షేమం ప్రజల వద్దకే వస్తాయని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆమె జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read: Seethakka:పేదరికంపై తుది పోరులో విజయం సాధిస్తాం.. సీతక్క కీలక వ్యాఖ్యలు
ఒక్క అవకాశం నవీన్ కు ఇవ్వాలి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారని, నవీన్ గెలిస్తే, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. ఒక్క అవకాశం నవీన్ కు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నాలుగున్నర లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. పేదలకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. బీఆర్ ఎస్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కానీ జూబ్లీహిల్స్ లో తాము 15 వేల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.
శ్రీశైలం యాదవ్ ప్రచార రథం ఇస్తేనే కేసీఆర్ పార్టీ పెట్టారు
ఇక నవీన్ పై కేసీఆర్, కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ తప్పుడు కూతలు కూస్తున్నారని, నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ ప్రచార రథం ఇస్తేనే కేసీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. తొనినాళ్లలో టీఆర్ ఎస్ ప్రచారానికి నవీన్ యాదవ్ కుటుంబ డబ్బులు వాడుకున్నారన్నారు. ఇప్పుడు నవీన్ పై తప్పుడు మాటలు మాట్లాటడం సరికాదన్నారు. అన్నం పెట్టిన చేయికి సున్నం పెట్టడం కేసీఆర్ కుటుంబానికి అలవాటేనని చెప్పారు. ఇక టీఆర్ ఎస్ పార్టీలో రౌడీ షీటర్లు చేరారన్నారు. బాలికలను, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని? ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Also Read: Seethakka: మేడారం చరిత్రలో నిలిచిపోయేలా సాగుతున్న పనులు.. మంత్రి సీతక్క వెల్లడి!

