Operation Hidma (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Operation Hidma: ఆపరేషన్ హిడ్మా సక్సెస్ అవుతుందా..? ఇక మావోయిస్టుల పని అయిపోయినట్లేనా..!

Operation Hidma: మావోయిస్టులకు స్వర్గధామలుగా నిలిచిన ప్రాంతాలు ఇప్పుడు పోలీసుల వశమయ్యాయి. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించిన మావోయిస్టు వ్యవస్థ నేడు అంతిమ దశకు చేరుకుంది. మావోయిస్టులకు స్వర్గధామంగా నిలిచిన చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని అబూజ్ మాడ్, నార్త్ బస్తర్ సహా మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల మావోయిస్టు కీలక ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులంతా ఒక్కచోట చేరిపోయారని చర్చ విస్తృతంగా సాగుతుంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో మావోయిస్టుల దిశ మార్చుకుంటున్నారనేది స్పష్టమవుతుంది.

భూవీ ట్రాప్ తో మావోయిస్టుల పటిష్ట భద్రత

చత్తీస్గడ్ రాష్ట్రంలోని మావోయిస్టు కీలక ప్రాంతాలు భద్రత బలగాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు నిలయాలుగా మారిన ప్రాంతాలన్నీ కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. దీంతో మావోయిస్టులంతా ఏకమయ్యారు. సేఫ్ జోన్ గా భావించిన మావోయిస్టులంతా సౌత్ బస్తర్ ప్రాంతంలో నిక్షిప్తమైనట్లుగా విశ్వస సమాచార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇద్దరు కీలక కేంద్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోని మావోయిస్టుల విధివిధానాలు మారిపోయాయనేది హాట్ టాపిక్. ఈ పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు కీలక నేత, (పి ఎల్ జి ఏ, రెడ్ ఆర్మీ) దళపతి, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి హిడ్మ సౌత్ బస్తర్ ప్రాంతంలో ఉన్నట్లుగా కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు అమర్చిన భూవీ ట్రాప్స్ తో మావోయిస్టులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ భద్రత బలగాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 300 మంది మావోయిస్టులు వారి కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: Nepotism: నెపోటిజం అంటే ఏమిటి?.. టాలీవుడ్‌లో అది ఎంతవరకూ ఉందంటే?

ఆపరేషన్ హిడ్మా సక్సెస్ అవుతుందా..?

గత కొంతకాలంగా సీనియర్ నాయకులు సరెండర్ అవుతున్న నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. దీంతో మావోయిస్టు దళాల్లో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. గడిచిన 10 నెలల్లో 19 మంది ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు 9 మంది ఎన్కౌంటర్లలో మృత్యువాత చెందారు. మరో ముగ్గురు (మల్లోజుల, ఆశన్న సీతక్క) లొంగి పోయారు. మల్లోజుల, ఆశన్న, వివిధ ప్రాంతాల లీడర్లతో మావోయిస్టులు 1500 మంది లొంగిపోయారు. అదేవిధంగా 33 మంది మృతి చెందినట్లుగా పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని స్పష్టంగా బస్తర్ ఐజి సుందర్ రాజ్ బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం 300 మంది మావోయిస్టులు ఉన్నారనేది ఐజి సుందర్ రాజ్ వెల్లడిస్తున్నారు. వీరందరినీ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఆర్గనైజ్ చేస్తున్నారనే చత్తీస్గడ్ రాష్ట్ర ఇంటిలిజెన్సీ విభాగం ద్వారా సమాచారం తెలుస్తోంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందాక కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవికి ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్ రావు పోటీ పడినట్టుగా అంతర్గత విభేదాల సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ(Telangana) ప్రాంతం జగిత్యాల(jagithyala) జిల్లాకు చెందిన 60 ఏళ్లకు పైబడిన మావోయిస్టు దళిత నేత, హిడ్మా కు సన్నిహితుడైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ ని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పటి నుంచే మావోయిస్టు పార్టీలో విభేదాలు వెళ్లడైపోయాయి. కేంద్ర కమిటీ సభ్యుల్లో కొనసాగుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ, హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ హిడ్మా పేరిట కేంద్ర ప్రభుత్వ, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రతా బలగాలు ప్రత్యేక ఫోకస్ నిర్వహిస్తున్నాయి.

విస్తృతంగా ప్రచారం… అవుతున్న హిడ్మా సరెండర్.?

కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రతా బలగాలు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత హిడ్మా సరెండర్ అవుతున్నారని ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు అంతా ఒక్కచోట ఉండి తమ కార్యకలాపాల నేపథ్యాన్ని చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మావోయిస్టు కీలక నేత హిడ్మా 200 మందితో లొంగి పోతున్నారని ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

Also Read: OG movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’.. ఎక్కడంటే?

సీనియర్ నాయకులు సరెండర్…

నాలుగు నుంచి ఐదు దశాబ్దాల రికార్డుతో ఉన్న మావోయిస్టు సీనియర్ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ రావు, ఆయన బాటలోనే నార్త్ బస్తర్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియా రూపేష్, అలియాస్ సతీష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, చత్తీస్గడ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ ప్రాంతానికి చెందిన సునీల్ సైతం ఇటీవలనే చత్తీస్గడ్ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న మావోయిస్టులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి, జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు వచ్చేవారిని ఆహ్వానించడంతోపాటు వారికి ఉద్యోగం, ఉపాధి వంటి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం, ఏం మాత్రం చదువు లేని వారందరికీ ఉపాధి కల్పించడం, మూడు సంవత్సరాల పాటు నెలకు పదివేల రూపాయలు అందజేయడం, తక్షణ సహాయం కింద 50000 అందించడం, ఏకే 47 వంటి ఆయుధాలు ఉన్నవారికి ఐదు లక్షల రివార్డు ఇవ్వడం, అర్బన్ ప్రాంతాలైన వారికి 300 గజాల నివాస యోగ్యంగా ఉన్న ఫ్లాట్ లను వారికి రిజిస్ట్రేషన్ చేయించడం, రూరల్ ప్రాంతాలైన వారందరికీ హెక్టార్ చొప్పున వారి పేరున పట్టాదారు పాస్బుక్ అందివ్వడం, రీ

ట్రైబల్ వర్సెస్ తెలుగు రాష్ట్రాలు

ప్రస్తుతం నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత ఆయన పదవికి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా సహచరుడు దేవూజీ కి అప్పగించడం, అదేవిధంగా కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అనంతరం వెల్లడించే ప్రతి లేఖ వికల్ప్ పేరిట వెళ్లడవడం ఇది మావోయిస్టు పార్టీ అత్యంత కీలక ప్రకటనగా భావించే నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ హిడ్మా పేరిట వస్తుందనేది మావోయిస్టు అంతర్గత విభేదాలకు కారణమైంది. ఈ క్రమంలోనే చత్తీస్గడ్ ప్రాంత ఆదివాసి ట్రైబల్ మావోయిస్టు నాయకులకు తెలుగు రాష్ట్రాల మావోయిస్టు ప్రాంతాల నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోని అత్యధికంగా తెలుగు ప్రాంతాలకు చెందిన వారితో పాటు వారి అనుచర గణం మొత్తం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. అటు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు రోజురోజుకు అంతమవడంతో పాటు అందులో పని చేసే ఆగ్రనేతలు సైతం పోలీసుల ఎదుట లొంగిపోవడంతో వివిధ క్యాడర్ లలో ఉన్న వారంతా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఆపరేషన్ ఆకర్ష్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Konda Surekha: స్వేచ్ఛ ఎఫెక్ట్.. దేవాదాయశాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష!

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..