Nepotism: సినిమా ప్రపంచంలో “నెపోటిజం” అనే పదం ఎప్పుడూ చర్చలకు దారితీస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇది గొడవలకు కారణమైతే, మన టాలీవుడ్‌లో కూడా ఇది ఒక ద్వంద్వం. కుటుంబ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చే స్టార్ కిడ్స్ విజయం సాధిస్తున్నారా, లేక కొత్త టాలెంట్‌ను అడ్డుకుంటున్నారా? దీని గురించి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
Read also-Upasana Konidela: మెగా ఫ్యామిలీలో డబుల్ దీపావళి.. మరో వారసుడు వచ్చేస్తున్నాడోచ్.. ఫ్యాన్స్‌కు పండగే!
నెపోటిజం అంటే ఏమిటి?
నెపోటిజం అంటే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. లాటిన్ మూలాల్లో “నెపోస్” (మేనల్లుడు) నుంచి వచ్చింది. సినిమాల్లో ఇది మొదటి అవకాశాలు, పెద్ద బడ్జెట్‌లు, మార్కెటింగ్ సపోర్ట్‌తో కనిపిస్తుంది. మంచి వైపు: రిస్క్ తక్కువ, ఫ్యామిలీ ఇమేజ్ సహాయపడుతుంది. చెడు వైపు: కొత్తవారికి డోర్ మూసివేస్తుంది, కంటెంట్ క్వాలిటీ పడిపోతుంది. భారతీయ సినిమాలో ఇది సాధారణం, కానీ 2025లో OTT ప్లాట్‌ఫామ్‌లు మార్పు తీసుకువస్తున్నాయి.
టాలీవుడ్ చరిత్రలో నెపోటిజం కుటుంబ డైనస్టీలతో ప్రసిద్ధి. నందమూరి కుటుంబం (ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్), అక్కినేని (నాగార్జున నుంచి చైతన్య, అఖిల్), కొనిదెల-అల్లు (చిరంజీవి నుంచి రామ్ చరణ్, అర్జున్), దగ్గుబాటి (వెంకటేష్, రానా), ఉప్పలపాటి (ప్రభాస్) వంటి ఫ్యామిలీలు డామినేట్ చేస్తున్నాయి. మహేష్ బాబు కుమారుడు గౌతం, సితార ఇలా వారసులు టాలీవుడ్ ను వారసుతతో నింపేస్తున్నారు. ఓ ఇంటర్య్వూలో రానా ఇలా అన్నారు.. “ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అవకాశాలు త్వరగా ఇస్తుంది, కానీ టాలెంట్ లేకపోతే ఫెయిల్ అవుతాం.” మంచు మనోజ్ జూలై 2025లో అన్నాడు: “ఇక్కడ అంతా డెకాల్స్ (కాపీలు) – నెపోటిజం వల్లే.” విజయ్ దేవరకొండ కూడా “నెపోటిజం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి” అని షాకింగ్ కామెంట్ చేశారు.
Read also-OG movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఓజీ’.. ఎక్కడంటే?
ప్రొడ్యూసర్ నాగ వంశీ అన్నారు.. “టాలీవుడ్‌లో నెపోటిజం లేదు, టాలెంట్ మాత్రమే ముఖ్యం.” నాని, విజయ్ దేవరకొండ, సిద్ధు జోనలగడ్డ వంటి సెల్ఫ్-మేడ్ స్టార్లను ఉదాహరణలుగా చెప్పాడు. కానీ నెటిజన్లు ట్రోల్ చేశారు.. “ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఎవరు?” అంటూ అదే విధంగా జగపతి బాబు అయితే.. “నెపోటిజం కొత్త టాలెంట్‌ను ఆపదు. OTTలో చూడండి, కొత్తవారు సక్సెస్ అవుతున్నారు.” రామ్ పోతినేని కూడా “స్టార్ కిడ్స్‌పై ప్రెషర్ ఎక్కువ” అని చెప్పాడు. రెడ్డిట్, క్వోరాలో డిబేట్: టాలీవుడ్‌లో నెపోటిజం బాలీవుడ్‌తో పోలిస్తే తక్కువ, కానీ 9/10 టాప్ స్టార్లు నెపోలే. పాజిటివ్ ఏంటంటే.. ఫ్యామిలీలు పెద్ద హిట్స్ (బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్) ఇస్తున్నాయి. నెగటివ్ అయితే అఖిల్ వంటివారు ఫెయిల్ అయ్యారు. మార్పు వస్తుందా అంటే..2025లో పాన్-ఇండియా సినిమాలు, OTT వల్ల కొత్తవారికి అవకాశాలు పెరుగుతున్నాయి.
