OG movie OTT: పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓజీ’ థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే స్ట్రోమ్ ఓటీటీలో సృష్టించడానికి వచ్చింది. ముంబై అండర్‌వరల్డ్‌లో డాన్ గా మారిన ఒక మాఫియా బాస్‌కు సంబంధించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది కాల్ హిమ్ ఓజీ’ (ఓజీ) సినిమా. పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది మరోసారి తమ హీరోను ఇంటి నుంచి ఆస్వాదించే అవకాశం కలిగింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 23, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా, తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.
Read also-Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పోస్టర్ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే?
థియేట్రికల్ రన్ తర్వాత మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది ‘ఓజీ’. సుజిత్ డైరెక్షన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపొందిన ‘ఓజీ’, ముంబై మాఫియా ప్రపంచాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని, పదేళ్ల తర్వాత తిరిగి వచ్చి ప్రతీకారం తీర్చుకునే కథను చెబుతుంది. పవన్ కల్యాణ్ ఓజస్ గంభీర (ఓజీ) పాత్రలో మార్షల్ ఆర్ట్స్, కత్తి పోరాటాలతో పాటు తన దూకుడు పెర్ఫార్మెన్స్‌తో స్క్రీన్ పై అలరించారు. ఎమ్రాన్ హాష్మీ విలన్ ఓమి భౌ పాత్రలో భయంకరంగా మెరిసాడు. ప్రియాంక మోహన్ కన్మణి (హీరో భార్య), నెహా షెట్టి, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ప్రకాశ్ రాజ్ మొదలైనవారు కీలక పాత్రల్లో నటించారు. తమన్ ఎస్ సంగీతం, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Read also-Gummadi Narsaiah: శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ ఏం ఉంది గురూ..
సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదలైన ‘ఓజీ’, ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసి, 2025లో అత్యధిక గ్రాస్ చేసిన తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. దీనిని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రమోల్లో చూపిన కొన్ని సీన్స్ థియేట్రికల్ కట్‌లో లేకపోవడంతో కానీ కొంచెం నిరాశ కూడా వ్యక్తం చేశారు. ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ సాంగ్ చేర్చకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో మరింత మందికి చేరువ కానుంది. థియేటర్లలో చూడలేని కొందరు అభిమానుల కాలయాపనకు ఈ రోజు తెరపడింది. అయితే ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంటదో చూడాలి మరి.
Bombay has seen many storms. Only one left a scar and They call him OG! 😤 pic.twitter.com/PfOzFR8YYj
— Netflix India (@NetflixIndia) October 22, 2025
