Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై ఇప్పటికే బజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పై నెలకున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు గానే సినిమాకు ట్రైటిల్ ‘ఫౌజి’గా నిర్ధారించారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు. దీనిని చూసిన ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా 1940ల బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో ఒక పీరియడ్ వార్ డ్రామా, యాక్షన్, రొమాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోందని మూవీ టీం తెలిపింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1930లు, 1940ల స్వాతంత్ర్య యుద్ధాల నేపథ్యంలో జరుగుతుంది. ప్రభాస్ ఒక సైనికుడు పాత్రలో కనిపించబోతున్నారు. అతని క్యారెక్టర్ “మోస్ట్ వాంటెడ్ సింస్ 1932” అనే ట్యాగ్‌లైన్‌తో బ్రిటిష్ పాలిత భారతదేశంలో ఒక సీక్రెట్ ఏజెంట్ లేదా స్పై లాంటి రహస్య లుక్‌ను సూచిస్తోంది. ప్రీ-లుక్ పోస్టర్‌లో ప్రభాస్ లాంగ్ కోట్, బూట్స్ ధరించి, షాడోలో కనిపించడంతో అతని పాత్ర ఒక రహస్య యోధుడిగా ఊహించబడుతోంది. కథలో ప్రేమ, యుద్ధం, ధైర్యం మధ్య సంఘర్షణలు చిత్రించబడతాయి, “ఒక బటాలియన్ నిలబడుతుంది” అనే ట్యాగ్‌లైన్ పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తోంది. ఇది మహాభారతం నుండి ఇన్‌స్పైర్డ్ వార్ డ్రామా అని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు కథ ఏంటి అన్నదాని వేచి ఉండాల్సిందే.
Read also-Gummadi Narsaiah: శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ ఏం ఉంది గురూ..
