gummadi-narsayya( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Gummadi Narsaiah: శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ ఏం ఉంది గురూ..

Gummadi Narsaiah: ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రజా మనిషి గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్రను తెరపైకి తీసుకు వస్తున్నారు. పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరు అందరికీ తెలిసిందే. ఇక గుమ్మడి నర్సయ్య పాత్రలో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటించబోతున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ మీద ఎన్. సురేష్ రెడ్డి నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు.

Read also-Highest paid heroes: టాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోలు వీళ్లే..

ఇక ఈ పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే గుమ్మడి నర్సయ్య పాత్రకు శివ రాజ్ కుమార్ ప్రాణం పోసినట్టుగా కనిపిస్తోంది. ఆ లుక్, వేషధారణ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సైకిల్, వెనకాల ఉన్న అసెంబ్లీ, ఎర్ర కండువా ఇలా అన్నీ కూడా ఎంతో అథెంటిక్‌గా ఉన్నాయి. ఇక ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసినట్టు అయింది. ఇక మోషన్ పోస్టర్‌లో ఎమ్మెల్యేలు అంతా కూడా కారులో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌లో రావడం.. ఆ మ్యూజిక్, ఆర్ఆర్.. విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తోంది.

Read also-Rishabh Tandon death: గుండెపోటుకు గురై ప్రముఖ గాయకుడు మృతి.. చిన్న వయసులోనే..

నిర్మాత ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మించబోతోన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బిలి, ఎడిటర్‌గా సత్య గిడుటూరి పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర విషయాల్ని త్వరలో  ప్రకటించనున్నారు. విడుదలైన మోషన్  పోస్టర్ ను చూస్తుంటే.. ప్రతి ప్రేమ్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. గుమ్మడి నర్సయ్య జీవితమే ఆదర్శము అలాంటి వ్యక్తి గురించి సినిమా రాబోతుందుంటే సామాన్య ప్రేక్షులకు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుతానికి మోషన్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేశారు నిర్మాతలు. గుమ్మడి నర్సయ్య ఎలి వేషన్స్ చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టకున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!