Rishabh Tandon death: బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, నటుడు గుండె పెటుతో మరణించారు. ముంబైకి చెందిన 32 ఏళ్ల ప్రసిద్ధ గాయకుడు, సంగీత సృష్టికర్త నటుడు రిషభ్ తండన్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గాయకుడు. ఢిల్లీలో తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లినప్పుడు ఆకస్మిక గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరారు. అనంతరం మరణించారు. ఈ వార్త ఒక్కసారిగా భారతీయ సంగీత ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. 32 ఏళ్ల వయసులోనే ఈ దుర్ఘటన జరగడం, అభిమానులను కలచి వేసింది. రిషభ్ తండన్ ఆధ్యాత్మిక శక్తి కలిసిన ఒక ఫకీర్. ముంబైలో జన్మించి పెరిగిన ఈ యువకుడు, శివుని భక్తుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు. అతని గానాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదు, ఆత్మానుభూతిని మెలకువలోకి తీసుకువెళ్లేవి. ‘ఫకీర్ – లివింగ్ లిమిట్‌లెస్’ ‘రష్నా: ది రే ఆఫ్ లైట్’ వంటి చిత్రాల్లో అతను నటించి, తన ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు.
Read also-Rajesh Danda: ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ‘కె ర్యాంప్’ నిర్మాత.. అందుకేనా..
అతని స్వరం, లిరిక్స్‌లు యువతలో ఆధ్యాత్మికతను రేకెత్తించాయి. ముంబై ఇండస్ట్రీలో అతను అజారీ సాంగ్‌లు సృష్టించి, ఫ్యూజన్ మ్యూజిక్‌లో తన ముద్ర వేశాడు. రిషభ్ కెరీర్ ప్రారంభం సాధారణంగానే ఉంది. కానీ, అతని ఆధ్యాత్మిక ప్రయాణం అతన్ని ప్రత్యేకంగా మార్చింది. సోషల్ మీడియాలో అతని పోస్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. మరణానికి ముందు ఒక పోస్టులో అతను ఇలా రాశాడు.. “సీనియర్ కళాకారులు స్టేజ్‌పై ఉన్నత శక్తులకు లొంగిపోతున్నారని విని ఆశ్చర్యపోయేవాడిని. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను – అది నేను కాదు, దైవ శక్తి మాట్లాడుతోంది. ఫకీర్‌గా, కళను సృష్టించడం నా ధర్మం.” అంటూ రాసుకొచ్చారు.
Read also-Mass Jathara: ‘మాస్ జాతర’ స్టోరీ ఏంటో చెప్పేసిన నిర్మాత నాగవంశీ.. మాస్‌కి జాతరేనా..
మరొక పోస్టులో, “ప్రతి లిరిక్‌లో నొప్పి మోసుకుంటున్నాను, కానీ మ్యూజిక్ ద్వారా దాన్ని అధిగమిస్తున్నాను. ఇది ఎస్కేప్ కాదు, ప్రపంచ శబ్దాన్ని బ్రతికించడం” అని భావోద్వేగంగా పంచుకున్నాడు. ఈ పోస్టులు ఇప్పుడు అభిమానులకు మరింత దార్శనికంగా మారాయి. దీపావళి రోజున ఈ దుర్ఘటన జరగడం మరింత బాధాకరం. ఢిల్లీలో తల్లిదండ్రులను కలవడానికి వెళ్లిన అతను, ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటనతో సంగీత ప్రపంచం మొత్తం షాక్‌లో ఉంది. ఇటీవలే జూబిన్ గార్గ్ మరణం తర్వాత, ఈ వార్త మరింత దుఃఖాన్ని తెచ్చింది. అభిమానులు సోషల్ మీడియాలో ట్రిబ్యూట్‌లు అర్పించడం మొదలుపెట్టారు. “ఫకీర్ గానాలు ఎప్పటికీ జీవించి ఉంటాయి” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
