RAJESH-DANDA(image :X)
ఎంటర్‌టైన్మెంట్

Rajesh Danda: ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ‘కె ర్యాంప్’ నిర్మాత.. అందుకేనా..

Rajesh Danda: కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన కె ర్యాంప్ సక్సస్ మీట్ లో ఆ సినిమా నిర్మాత ఓ మూవీ వెబ్ సైట్ పై ఫైర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏం అన్నారంటే.. ‘మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. ఓ వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది. అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు.’ అంటూ రాసుకొచ్చారు.

Read also-Mass Jathara: ‘మాస్ జాతర’ స్టోరీ ఏంటో చెప్పేసిన నిర్మాత నాగవంశీ.. మాస్‌కి జాతరేనా..

అంతే కాకుండా..‘ గతంలో ‘మ్యాడ్ 2’ సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు. ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది. నా బాధ, కోపం లో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా యుద్దం మీడియా మీద కాదు మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్న ఆ వెబ్ సైట్ మీద’ అంటూ వివరణ ఇచ్చారు.

దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘కె-ర్యాంప్’ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన ఈ చిత్రం, దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా, శివ బొమ్మక్కు నిర్మాణంలో వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెలిసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రేంపేజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు నిర్మాతలు. అయితే, ఈ ఈవెంట్‌లో నిర్మాత రాజేష్ దండా సినిమా హిట్ అయినా నెగిటివ్ గా రివ్యూలు ఇచ్చిన ఒక వెబ్ సైట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also-Highest paid heroes: టాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోలు వీళ్లే..

అమెరికాలో ఆధారిత ప్రముఖ తెలుగు వెబ్‌సైట్ పై గట్టిగా ఫైర్ చేశారు. రాజేష్ దండా మాట్లాడుతూ.. ఈ సైట్ 2.5/5 రేటింగ్ ఇచ్చి, సినిమాను ‘టైమ్‌పాస్’గా వర్గీకరించింది. దీనిపై రాజేష్ దండా, “వాళ్ల సినిమా ఫెయిల్ అయిందని మా సినిమాను కూడా డౌన్ చేయాలా? మా మీద బ్రతికే వాళ్లు, మా మీదే ఫోకస్ చేస్తున్నారు. ఉరి తియ్యాలి వాళ్లను!” అంటూ తీవ్ర భాషలో వ్యాఖ్యానించారు. ఈ వెబ్‌సైట్ ఓనర్‌పై ఆగ్రహం చూపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రివ్యూల కంటే ప్రేక్షకుల ఆదరణే మా విజయాన్ని నిర్ధారిస్తోంది. మా టీమ్ అంతా ఆనందంగా ఉన్నాం” అని చెప్పారు. ఈ మాటలు ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణకు దారితీస్తున్నాయి.’ అని అన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!