Excise Department(image credit:X)
హైదరాబాద్

Excise Department: రూ. 4 లక్షల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత.. ఎక్కడంటే?

Excise Department: రూపాయలు లక్షలు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద ఫంక్షన్ లు చేస్తారు. వచ్చిన అతిథులకు తమ దర్పం చూపించుకోవడానికి మద్యం, మాంసం బిర్యాని పెడతారు. కానీ తెలంగాణ మద్యం వాడకుండా కొద్దిపాటి తక్కువ ధరలకు లభించే నాన్ డ్యూటీ పై లిక్కర్ ను తెప్పించి వాడుతారు. దీనికి తోడు ఫంక్షన్‌‌లల్లో మద్యం వినియోగించుకోవడానికి అవసరమైన అనుమతి ఎక్సైజ్ శాఖ నుండి పర్మిషన్ తీసుకోకుండా, విదేశీ మద్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి బంధువులకు పెట్టి గొప్పలు చాటుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు.

అనుమతి లేకుండా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగిస్తున్నారు అనే సమాచారం మేరకు శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు మోయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో దాడి చేసి ఫంక్షన్ లో వినియోగిస్తున్న 52 మద్యం బాటిలను సీజ్ చేయడంతో పాటు ఫంక్షన్ హాల్ పై కేసు నమోదు చేయడం చేశారు.

Also read: Operation Sindoor: ప్రధాని అత్యవసర భేటి.. భారత వైమానిక దళం సంచలన ప్రకటన!

వివరాల్లోకి వెళితే..
మొయినాబాద్ పరిధిలో గోలమారి అనేటువంటి ఫంక్షన్ హాల్ లో ఒక కుటుంబం తమ పిల్లల ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఫంక్షన్ లో వచ్చినటువంటి బంధువులకు అతిథులకు మద్యం మాంసం పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ మద్యానికి బదులు ఢిల్లీ, డిఫెన్స్ మద్యం బాటిల్లను నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని వినియోగిస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి 52 మద్యం బాటిల్లను ఫీజు చేసేటువంటి పరిస్థితిని తీసుకున్నారు. సీఐ ప్రవీణ్ కుమార్ బృందం ఫంక్షన్ లోంచి 52 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీకి చెందినటువంటి 50 బాటిల్లు, బ్లాక్ లేబుల్, గోవాకు చెందిన నాలుగు బాటిల్లు, డ్యూటీ పేడ్ లిక్కర్ 3 తెలంగాణకు చెందిన మూడు, లిక్కర్లు 12 బీర్ బాటిల్లను ఎక్సైజ్ పోలీసులు సీఐ ప్రవీణ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు.

Also read: Viral Video: దరిద్రం అంటే మీదే బ్రో.. ఉత్తి పుణ్యానికి రూ.కోటి బిల్లు కట్టారు?

మద్యం వినియోగించిన వ్యక్తిపై కేసు నమోదు తో పాటు మద్యం వినియోగానికి లైసెన్స్ తీసుకోకుండా ఫంక్షన్ నిర్వహణ ఇస్తున్నటువంటి ఫంక్షన్ హాల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కృష్ణప్రియ తెలిపారు.

ఎన్డీపిఎల్ మద్యాన్ని పట్టుకున్నటువంటి శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!