Operation Sindoor (Image Source: Twitter)
జాతీయం

Operation Sindoor: ప్రధాని అత్యవసర భేటి.. భారత వైమానిక దళం సంచలన ప్రకటన!

Operation Sindoor: కాల్పుల విరమణకు అంగీకరించినట్లే చెప్పి దయాదీ దేశం పాకిస్థాన్ మళ్లీ కయ్యానికి కాలు దువ్వుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తన నివాసంలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రధాని భేటి అయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ బ్రేక్ చేసిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటిలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో పరిస్థితి గురించి కూడా చర్చించినట్లు సమాచారం.

ప్రధానీ మోదీ అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఇంకా ముగియలేదని ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఇకపైనా కొనసాగుతున్నట్లు తేల్చి చెప్పింది. తమకు అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేసినట్లు చెప్పింది. ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియా వేదికగా వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని భారత వైమానిక దళం స్పష్టం చేసింది.

అయితే శనివారం కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనకు కొన్ని గంటల ముందే ప్రధాని మోదీ త్రివిధ దళాల సైన్యాధిపతులతో భేటి అయ్యారు. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. భేటి అనంతరం మాట్లాడిన జైశంకర్.. ఉగ్రవాదంపై భారత్ రాజీలేని తన దృఢమైన వైఖరిని కొనసాగిస్తుందని చెప్పారు. ఆపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడం.. దాన్ని కొద్ది గంటల్లోనే పాక్ ఉల్లంఘించడం జరిగిపోయాయి. సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు దాడికి యత్నించడంపై రాత్రి సమావేశం నిర్వహించిన విదేశాంగ కార్యదర్శి.. దీనికి పాక్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. దాడిని ఎదుర్కొనేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: India Pak War: పాక్ ఇంత నీచమైందా.. 1949 నుంచి తప్పు మీద తప్పు.. భారీ మూల్యం తప్పదా!!

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్