MLA Shankaraiah
హైదరాబాద్

MLA Shankaraiah: ప్రతి పథకం ప్రజలకోసమే.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

షాద్ నగర్ స్వేచ్ఛ: MLA Shankaraiah: బిసి కుల గణన చారిత్రాత్మకమని, బీసీ వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. అసెంబ్లీ లో బిసి రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తారని తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను సాధిద్దామని, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐతో పాటు అన్నిరాజకీయ పార్టీలను కలుపుకొని ఢిల్లీకి వెళ్లి సత్ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం పట్ల సాధారణ నియోజకవర్గం బీసీ నాయకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు స్వీట్లు తినిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువతకు వరం….

రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువతకు వరమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా నెరవేరుస్తూ వస్తోందని, ఆరు గ్యారంటీ హామీల్లో ఇప్పటికే పలు పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోందని అన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో హామీ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారని, ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది నిరుద్యోగ యువత లబ్ధి పొందనున్నారని ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేసి 60 నుంచి 80 శాతం వరకు రాయితీ కల్పించనున్నట్లు తెలిపారు.

Also Read: Hyderabad Rental Scam: హైదరాబాద్ లో కోలివింగ్ పేరిట దోచుడే దోచుడు.. అమాయక యువతులే టార్గెట్?

ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం వల్ల యువతకు ఉపాధి మార్గాలు పెరుగుతాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.

షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు18 కొత్త బస్సులు….
షాద్నగర్ ఆర్టీసీ డిపోకు నూతనంగా 18 బస్సులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఉద్దేశంతో గతంలో ప్రభుత్వానికి అదనంగా బస్సులు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా 18 బస్సులు వచ్చాయని గుర్తు చేశారు.

మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో బస్సుల కొరత ఉండకూడదని ఉద్దేశంతో అదనంగా మరిన్ని బస్సులు కావాలని ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం స్పందించి నూతనంగా 18 కొత్త బస్సులను మంజూరు చేసేందుకు అంగీకరించిందని వివరించారు . షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో కొంత సిబ్బంది కొరత ఉందని దీనిని కూడా అధిగమిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో రవాణా మార్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

నకిలీ జర్నలిజాన్ని సహించేది లేదు..
జర్నలిజం పేరుతో నకిలీలు చేస్తున్న అరాచకాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. విలేకరుల ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. షాద్నగర్ మైండ్ స్ట్రీమ్ మీడియా గౌరవ అధ్యక్షులు కెపి, అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, శ్రీశైలం, సీనియర్ జర్నలిస్టులు మోహన్ రెడ్డి, రంగనాథ్, రాఘవేందర్ గౌడ్, నరేష్ తదితరులు ఎమ్మెల్యే శంకర్ కి వినతి పత్రం అందజేశారు.

Also Read: CM Revanth Reddy: తప్పలేదా? తప్పించుకోలేకనా?.. రేవంత్ రెడ్డికి జై కొట్టిన ప్రతిపక్షాలు..

నకిలీ రిపోర్టర్ల బాగోతాన్ని, అక్రమ వసూళ్లు తదితర అంశాలను నివారించాలని అదేవిధంగా జర్నలిస్టులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇండ్ల స్థలాలను ఇవ్వాలని ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ నకిలీ జర్నలిసాన్ని సహించేది లేదని జర్నలిస్టులు సమాజానికి మూల స్తంభం అని వర్కింగ్ జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలని, జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు
లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తాం..
షాద్నగర్ నియోజకవర్గం లో లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఎమ్మెల్యే వివరించారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కంసాన్పల్లిలో గల గణేకృత పసి వీర్యోత్పత్తి కేంద్రం అభివృద్ధి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు.

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు 50 ఎకరాలకు పైగా స్థలం కేటాయించిందని , ఆ తర్వాత గత ప్రభుత్వం కొంత నిధులు కేటాయించారని అయినప్పటికీ పశువు వీరకేంద్రం వృధాగా ఉందని ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి మరింత అభివృద్ధికి కృషి చేస్తానని, చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం,తదితర నియోజకవర్గ అభివృద్ధి అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో సభలో మాట్లాడుతానని వివరించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, జంగా నరసింహా యాదవ్, పక్రభుత్వపెద్దలు పాల్గొన్నారు.

Also Read: KCR: జిల్లాలకు కేసీఆర్.. సిల్వర్ జూబ్లీ సక్సెస్ కోసమేనా?

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!