Hyderabad Rental Scam (image credit:AI)
హైదరాబాద్

Hyderabad Rental Scam: హైదరాబాద్ లో కోలివింగ్ పేరిట దోచుడే దోచుడు.. అమాయక యువతులే టార్గెట్?

Hyderabad Rental Scam: ఇద్దరికీ ముఖ పరిచయం లేదు.. ఎవరో కూడా తెలియదు.. కానీ ఒకే గది.. ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటున్నారులే అనుకోవద్దు.. ఒకరు అమ్మాయి.. మరొకరు అబ్బాయి. ఇదేంటి ముఖ పరిచయం లేకుండా ఇలా ఎలా? అనే సందేహం వచ్చిందా? అయితే మీరు కోలివింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. నగరాలలో ఇదొక ట్రెండీ ఫ్యాషన్ గా మారగా, చిన్నచిన్నగా గతంలో పలు దేశాలకే పరిమితమైన కోలివింగ్ రిలేషన్ షిప్ ఇప్పుడు మన దేశానికి పాకింది.

అంతేకాదు హైదరాబాద్ నగరానికి కూడా చేరింది. ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చే వారు అధికం. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా.. నగరంలో ఉపాధి పొందుతున్నారు.

ఎందరో నగరబాట పట్టగా, ఇలాంటి వారికి వసతి కల్పించేందుకు సిటీలో పుట్టగొడుగుల్లా హాస్టళ్లు వెలిశాయి. సిటీలోని ఏ మూలకు వెళ్లినా హాస్టల్స్ మనకు కనిపిస్తాయి. పలు హాస్టల్స్ యాజమాన్యాలు నిబంధనలు పాటిస్తూ, నాణ్యమైన ఆహారం అందిస్తూ ఆదరణ పొందుతున్నాయని చెప్పవచ్చు.

మరికొన్ని హాస్టల్స్ మాత్రం నిబంధనలు తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయాన్ని అలా పక్కన ఉంచితే.. బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఇలా వేరుగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో వేర్వేరు హాస్టల్స్ బదులు కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు కొందరు. అదే కో లివింగ్ అట. అంటే ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి ఒకే గదిలో నివాసం ఉంటూ తమ జీవనాన్ని ముందుకు సాగించడం. కొందరు మాత్రం కోలివింగ్ రిలేషన్ లో ఉన్నప్పటికీ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తమ పని తాము చేసుకు వెళ్ళేవారు ఉన్నారనుకోండి.

ఇక్కడే కొన్ని వివాదాలు పుట్టుకొస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. డబ్బు ఆశ చూపి కొన్ని హాస్టల్స్ యాజమాన్యాలు అమ్మాయిలకు ఎర వేసి ఆకర్షిస్తున్నాయన్న చర్చ సిటీలో జోరుగా సాగుతోంది.

అభం శుభం తెలియని కొందరు యువతులు ఇలాంటి మాయగాళ్ల చేతిలో చిక్కి ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. యువకుల బలహీనతను బలంగా మార్చుకున్న పలువురు.. అమ్మాయిలు మీ గదిలో ఉంటారు.. మాకు ఏం జరిగినా సంబంధం లేదు.. కానీ వివాదాలు రాకూడదు.. అయితే నెలకు ఇంత చెల్లించండి చాలు అంటూ ప్రచారం చేస్తున్నారట. ఈ మాయలో పడి వేలకు వేలు చెల్లించి మోసపోయిన యువకులు ఉన్నారని టాక్.

ఎన్నో గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ ఉన్నప్పటికీ కేవలం డబ్బుకు ఆశపడి కోలివింగ్ రిలేషన్ షిప్ అంటూ పలువురు యువతీ, యువకులు తమ జీవితాలు బుగ్గి పాలు చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద కోలివింగ్ సిస్టమ్ పై పోలీసులు ఓ కన్ను వేయాలని నగరవాసులు కోరుతున్నారు.

Also Read: Manchu Lakshmi: సజ్జనార్‌గారూ.. మంచు అక్కని ఎలా వదిలేశారు?

అలాగే నిబంధనలు పాటించని హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన భారతీయ సంస్కృతిని ఇతర దేశాల వారు గౌరవిస్తూ పాటించే స్థాయికి మనం చేరుకుంటే.. మనం మాత్రం పక్క దేశాల సంస్కృతిని పక్కన పెట్టుకుంటున్నట్లు విద్యావేత్తలు అంటున్నారు. కోలివింగ్ పేరుతో జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు వారు సూచిస్తున్నారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!