Ramki Employees Strike (imagecredit:swetcha)
హైదరాబాద్

Ramki Employees Strike: రాంకీ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. పేరుకుపోయిన చెత్త కుప్పలు

Ramki Employees Strike: మహానగరవాసులకు అత్యవసర సేవలందించే బల్దియాకు చెత్త సేకరణ, తరలింపు భారంగా మారింది. గ్రేటర్ పరిధిలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ తర్వాత దశలోనున్న సెకండరీ ప్రైమరీ చెత్త కలెక్షన్ చేసుకుని, డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యతలను స్వీకరించిన రాంకీ సంస్థకు చెందిన ఉద్యోగులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించటంతో డైలీ చెత్త ను సేకరించి, యార్డుకు తరలించాల్సిన సుమారు 270 వాహానాలు ఎక్కడికక్కడే నిల్చిపోవటంతో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలు సంభించిపోయాయి. చెత్తను సేకరించి తరలించేందుకు రాంకీ ప్రస్తుతం వినియోగిస్తున్న 270 వాహానాల్లో ఒక్క వాహానంపై సుమారు ఆరుగురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు, వీరిలో డ్రైవర్లు మొదలుకుని లేబర్ వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించటంతో చెత్త సేకరణ, తరలింపునకు సంబంధించి రాంకీ ప్రత్యామ్నాయంగా వివిధ జిల్లాల నుంచి వాహానాలను, సిబ్బందిని సమకూర్చే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. మొత్తం రాంకీకి చెందిన రెండున్నర వేల మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు, వారితో రాంకీ యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

శానిటేషన్ బాధ్యతలను

ప్రస్తుత చెత్త వాహానాల డ్రైవర్లకు రాంకీ నెలకు రూ. 28 వేలు, కార్మికులకు ఒక్కోక్కరికి రూ. 22 వేల జీతాలు చెల్లిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఇదే తరహాలో రాంకీ ఉద్యోగులు జీతాలు పెంచాలని డిమాండ్ చేయగా, అప్పట్లో నామమాత్రంగా పెంచి, తిరిగి ఏడాది తర్వాత పెంచుతామని ఇచ్చిన హామీని గుర్తు చేసినా, ఫలితం దక్కకపోవటంతో సోమవారం ఉదయం నుంచి రాంకీ ఉద్యోగులు విధులను బహిష్కరించినట్లు సమాచారం. రాంకీ ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించిన సమాచారాన్ని సేకరించిన వెంటనే కమిషనర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కమిషనర్ సీఎన్ర ఘుప్రసాద్(Raguprasad)లు రంగంలోకి దిగి రాంకీ సంస్థ యజామాన్యంతో మాట్లాడినట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో శానిటేషన్ బాధ్యతలను తీసుకున్న రాంకీ సంస్థ ప్రత్యామ్నాయంగా వాహానాలను, సిబ్బందిని సమకూర్చి, సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి సకాలంలో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం.

Also Read: Etela Rajender: వర్షం పడితే రోడ్లు చెరువులా మారుతున్న వైనం

ప్రతి గంటకోసారి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ రాంకీ సంస్థ యాజమాన్యంతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు రాంకీ(Ramki) సంస్థ 270 వాహానాల స్థానంలో ప్రత్యామ్నాయంగా 120 వాహానాలను సమకూర్చినట్లు అధికారులు వెల్లడించారు. రాంకీ ఉద్యోగుల పెంపు డిమాండ్, ఉద్యోగుల సమ్మె అనేది రాంకీకి సంబంధించిన విషయాలని, వాటిని రాంకీ పరిష్కరించుకోవాలని, అంతలోపు చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఇప్పటికే కమిషనర్ కర్ణన్ రాంకీకి స్పష్టం చేసినట్లు తెలిసింది.

నేరుగా డంపింగ్ యార్డుకు

ప్రస్తుతం మొదటి దశ సేకరణలో భాగంగా ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఈ చెత్తను నేరుగా ట్రాన్స్ ఫర్ స్టేషన్లకు తరలిస్తున్నాయి. ఇక సిటీలోని వివిధ ప్రాంతాలు, కూడళ్లు, గతంలో చెత్త కుండీలున్న ప్రాంతాలు, అధిక మొత్తం లో చెత్త నిల్వ ఉండే ప్రాంతాల నుంచి ఈ రాంకీ వాహానాలు రెండో దశగా చెత్తను సేకరించి, నేరుగా డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. గ్రేటర్ లోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతి రోజు పోగయ్యే చెత్తను జీహెచ్ఎంసీకి చెందిన మొత్తం 97 వాహానాలు డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా, దీనికి తోడు రాంకీ వాహానాలు 270 కూడా ఇదే రకమైన విధులు నిర్వహిస్తున్నాయి. చెత్త తరలింపులో అత్యధిక సంఖ్యలో పని చేస్తున్న రాంకీ వాహానాలు 270 ఒక్కసారిగా ఎక్కడికక్కడే నిల్చిపొవటంతో సీటిలో ప్రతి రోజు పోగయ్యే సుమారు 7500 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించే ప్రక్రియ స్తంభించినట్లు సమాచారం.

చెత్తను తరలించే వాహానాల్లో

రాంకీ సమ్మెకు ముందు 270 రాంకీ వాహానాలు, జీహెచ్ఎంసీకి చెందిన 97 వాహానాలు చెత్త సేకరణ, తరలింపు పనులు చేపట్టేవి. కానీ ఇపుడు రాంకీకి చెందిన 270 వాహానాలకు బ్రేక్ పడటంతో, ఆ వాహానాల స్థానంలో ప్రత్యామ్నాయంగా టాక్టర్, టాటా ఏస్ వంటి వాహానాలను వినియోగిస్తున్నందున చెత్త తరలింపు నెమ్మదిగా సాగుతున్నట్లు సమాచారం. ట్రాన్స్ ఫర్ స్టేషన్లతో పాటు చెత్త పోగయ్యే వివిధ ప్రాంతాల నుంచి సకాలంలో చెత్తను తరలించేలా రాంకీ ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాల్సిందేనంటూ జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో వత్తిడి చేస్తున్నా, డైలీ చెత్తను తరలించే వాహానాల్లో రాంకీ సోమవారం సాయంత్రానికల్లా సగం సంఖ్యలో మాత్రమే వాహానాలను ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తుండటంపై సోమవారం సాయంత్రం తీవ్ర స్థాయిలో జీహెచ్ఎంసీ అధికారులు రాంకీపై మండిపడినట్లు తెలిసింది.

Also Read: Crime News: దారుణం మహిళను బెదిరించిన కానిస్టేబుల్.. ఒప్పుకోకపోతే చంపేస్తానంటూ..!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?