Crime News: కోరిక తీర్చకపోతే నీ భర్తను.. పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్న హెడ్ కానిస్టేబుల్(Head Constable) పై బాధితురాలు సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తిరుమలగిరి(Tirumalagiri)లో నివాసముంటున్న వెంకటేశ్ (35) సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ హెడ్ కానిస్టేబుల్. ప్రస్తుతం రాజ్ భవన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, పొరుగింట్లోనే ఉంటున్న మహిళతో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలో కొన్నిరోజులుగా తన కోరిక తీర్చాలంటూ వెంకటేశ్(Venkatesh) ఆమెను వేధిస్తున్నాడు. భర్తకు విషయం చెబితే గొడవలు అవుతాయని భావించిన బాధితురాలు దీనిని దాచి పెట్టింది.
రెండు రోజుల క్రితం పిల్లలతోపాటు బల్కంపేటలోని పుట్టింటికి వచ్చింది. అయితే, ఇక్కడికి వచ్చిన వెంకటేశ్ ఇంట్లోకి చొరబడి కోరిక తీర్చక పోతే నీ భర్తను, పిల్లలను చంపేస్తానంటూ బాధితురాలిని భయ పెట్టాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కుడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
Also Read: TGSPDCL: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం?
తాజాగా సూర్యాపేట జిల్లాలో
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంకర్ పల్లి(Shankar Pally) పోలీస్ స్టేషన్ ఓ సంగటన జరిగింది. సీఐగా పని చేసిన మరో అధికారిపై కూడా ఇలాంటి ఆరోపణలు రావటంతో ఉన్నతాధికారులు అతన్ని ట్రాన్స్ ఫర్ చేశారు. ఇక, హైదరాబాద్(Hyderabad) సౌత్ జోన్ లోని కాలాపత్తర్ స్టేషన్ సీఐగా పని చేసిన మరో అధికారిపై మహిళా సిబ్బంది ఆన్ లైన్ ద్వారా పై అధికారులకు ఫిర్యాదులు చేశారు. సదరు సీఐ తమపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని తెలియచేశారు.
తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇలాగే ఓ ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్నట్టుకూడా ఆరోపణలు వచ్చాయి. విషయం పై బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సమాచారం. గతంలో ఈ ఎస్ఐ శాలిగౌరారం సర్కిల్ పరిధిలో పని చేసినపుడు స్థానికంగా ఉండే ఓ మహిళను వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. పెద్దగట్టు జాతర సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు కూడా పోలీసు వర్గాలే చెబుతున్నాయి.
Also Read: GHMC – Hydraa: శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయాలి.. లేదంటే కూల్చివేతలే!