GHMC - Hydraa (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC – Hydraa: శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయాలి.. లేదంటే కూల్చివేతలే!

GHMC – Hydraa: అసలే వర్షాకాలం..ఆపై భారీ వర్ష సూచనల నేపథ్యంలో వర్షంతో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటికే హైడ్రా(Hydraa), జీహెచ్ఎంసీ(GHMC), ట్రాఫిక్ పోలీసులు(Traffic Police), జలమండలి సమష్టిగా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తుండగా, చారిత్రక హైదరాబాద్ నగరంలో వందల ఏళ్ల క్రితం నిర్మించిన పాతకాలపు శిథిల భవనాలను గుర్తించి, వాటి వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్విన సెల్లార్లతో పాటు అనుమతులు ఉండి, రిటైనింగ్ వాల్ నిర్మించని సెల్లార్లపై కూడా వర్షాకాలం నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది.

ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్విన సెల్లార్ల వద్ద ప్రమాద నివారణ చర్యలను పట్టించుకోకుండా వదిలేసినట్టయితే వాటిని భవన నిర్మాణ వ్యర్థాలతో మూసివేయాలని కూడా కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన భవనాల్లో అవసరమైతే పటిష్ట చర్యలను చేపట్టాలని, పటిష్ట చర్యలు చేపట్టలేని స్థాయిలో ఉన్న పాతకాలపు భవనాల్లో నివాసముంటున్న వారిని ప్రత్యామ్నాయంగా మరో ఇళ్లలోకి తరలించాలని, లేని పక్షంలో ప్రమాదకరంగా మారిన పాతకాలపు, శిథిల భవనాలను నేలమట్టం చేసి, ప్రాణ నష్టం జరగుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం.

ఇటీవలే నోటీసులు జారీ చేసినా

తవ్వి వదిలేసిన సెల్లార్లతో పాటు మాదకరంగా మారిన పాతకాలపు శిథిల భవనాల(Homes) విషయంలో అవి కూలి, ఏమైన ప్రాణ నష్టం జరిగితే సంబంధిత సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులదే బాధ్యత అని కమిషనర్ తేల్చి చెప్పటంతో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు భవనాలను గుర్తించేందుకు , ప్రమాదకరంగా మారిన భవనాల్లో నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేందుకు ఫీల్డు విధులకు పరుగులు తీస్తున్నట్లు సమాచారం. వర్షాల కారణంగా బేగంబజార్(Begam Bazar) లో ఓ పాతకాలపై భవనం కుప్పకూలిన ఘటనపై కూడా కమిషనర్ ఆరా తీసినట్లు సమాచారం. ఈ భవనం ఇప్పటికే కాలం చెల్లిందని, వెంటనే కూల్చివేయాలంటూ జీహెచ్ఎంసీ(GHMC) యజమానికి ఇటీవలే నోటీసులు జారీ చేసినా, యజమాని పట్టించుకోలేదని అధికారులు వివరించారు. శిధిలావస్తలోనున్న భవనంలోనే యజమాని భవనాన్ని పటిష్టపరిచే చర్యలు చేపట్టకపోగా, పైగా అదే భవనంలో అద్దెకు వ్యాపార సంస్తలను కొనసాగిస్తున్నారని, ఈపాతకాలపు భవనం కూలిన సమయంలో ఎవరూ అక్కడ లేకపొవటంతో ప్రాణ నష్టం తప్పిందని కమిషనర్ కు అధికారులు వివరించినా, ఇలాంటి భవనాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం.

Also Read: Traffic DCP: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించటంతో పాటు..?

పాతకాలపు శిథిల భవనాలెన్నీ?

నగరంలోని 30 సర్కిళ్లలో ఎక్కువగా శిథిలావస్థకు చేరిన భవనాలెక్కువగా సికిందరాబాద్(Secunderabad), పాతబస్తీ ప్రాంతాల్లోనే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 30 సర్కిళ్లలో నగరంలో మొత్తం 685 శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో 327 భవనాలకు మరమ్మతులు పూర్తిచేయడం లేదా ఖాళీ చేయించడం వంటి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మిగతా 358 భవనాలకు సంబంధించి యజమానులకు నోటీసులు జారీ చేశామని, వాటిని నిర్మాణానికి సంబంధించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ(Structural stability) పై నివేదికలు తెప్పించుకుంటున్నట్లు, పూర్తిగా శిథిలావస్థకు చేరిన భవనాలను ఖాళీ చేసేలా, వాటిల్లో నివసిస్తున్న కుటుంబాలకు, యజమానులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

 ప్రమాద నివారణ చర్యలను

దీనికి తోడు ఇప్పటికే ఆరు జోన్లలో జీహెచ్ఎంసీ(GHMC) ఉన్నతాధికారులు ఇచ్చిన అనుమతుల ప్రకారం 154 సెల్లార్ తవ్వకాలలో 61 చోట్ల సెల్లార్లను తవ్వి, వాటి చుట్టూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా రిటైనింగ్‌ వాల్‌ పనులు పూర్తయినట్లు, మిగిలిన 93 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ(GHMC) అనుమతినిచ్చిన సెల్లార్లకు సంబంధించి వాటి చుట్టూ ప్రమాద నివారణ చర్యలను పక్కాగా అమలు చేయటంతో పాటు ఎలాంటి అనుమతుల్లేకుండా తవ్విన తలెత్తకుండా మరో 52 సెల్లార్‌లను నగరంలోని వివిధ చోట్ల నుంచి జీహెచ్ఎంసీ సేకరిస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలతో పూడ్చి వేయాలని, అక్రమంగా తవ్విన ఆ సెల్లార్ల వద్ద మళ్లీ ఎలాంటి నిర్మాణ పనులు జరగకుండా నిఘా పెట్టినట్లు సమాచారం.

Also Read: Crime News: బస్సులో పరిచయం.. చేపలు ఇస్తానంటూ మహిళను కిందకు దింపి..

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?